పట్టుకోల్పోతున్న అఫ్గనిస్తాన్.. తక్షణమే దాడులు నిలిపివేయకపోతే.. మహిళల పరిస్థితి దయనీయం... : యూఎన్ చీఫ్

By AN TeluguFirst Published Aug 14, 2021, 12:43 PM IST
Highlights

 అగ్రరాజ్య సేనలు హఠాత్తుగా అఫ్గాన్ ను వీడటంతో తాలిబాన్లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే 60 శాతానికి పైగా దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరోవారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వారు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వారు కాబూల్ సమపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలిక పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలమీద గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

జెనీవా : తాలిబాన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్థమైన అంతర్యుద్ధానికి దారి తీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 

అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే ఈ తరహా ఘర్షణలను చవి చూసిన దేశం మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది. ఇది అక్కడి ప్రజలకు తీరని విషాదం. అఫ్గాన్ వాసుల ప్రయోజనాల కోసం తాలిబాన్లు వెంటనే ఈ దాడుల్ని నిలివేయాలి. విశ్వాసంతో చర్చలు జరపాలి. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సరైన మార్గం కాదు. అది సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. 

అఫ్ఠాన్ ను ఒంటరిని చేస్తుంది. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తోన్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య సేనలు హఠాత్తుగా అఫ్గాన్ ను వీడటంతో తాలిబాన్లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే 60 శాతానికి పైగా దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

మరోవారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వారు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వారు కాబూల్ సమపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలిక పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలమీద గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Afghanistan : 81 శాతం భూభాగం తాలిబన్ల గుప్పిట్లో.. మిగిలింది రాజధాని కాబూలే.. !!

తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని.. మానవ హక్కులమీద ఆంక్షలు విధిస్తున్నానే నివేదికలతో కలత చెందాను. ఈ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. పౌరులపై దాడులకు తెగబడటం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అది యుద్ధ నేరానికి ఏ మాత్రం తీసిపోదు’ అని గుటెరస్ హెచ్చరించారు. 

కాగా, ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాలిబాన్లకు , ఆ దేశ బలగాలకు  మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులు బలవుతున్నారు. తాజాగా ఆఫ్గన్‌లోని నాలుగో అతిపెద్ద  నగరం మజార్ ఈ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తాలిబన్లు ప్రకటించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది. ఆఫ్గన్‌లోని భారతీయులు ప్రత్యేక విమానంలో మజార్ ఈ షరీఫ్‌ నగరం నుంచి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా సూచించింది.

వారి కోసం ప్రత్యేక విమానాన్ని అందుబాటులో వుంచింది కేంద్రం. మజార్ ఈ షరీఫ్‌లోని మెజారిటీ ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికే ఆక్రమించుకున్నారు. గత మే నెల నుంచి ఆఫ్గన్‌లోని అమెరికా బలగాలు కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దేశంలోని పలు జిల్లాలు తాలిబన్ల చేతిలోకి వెళ్తుండటంతో అక్కడి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే తాలిబన్ల వశం అవుతుందని.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 

click me!