గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయితే, నట్టేటముంచింది.. కోర్టులో దావా వేసిన బాధితులు...

By SumaBala Bukka  |  First Published Sep 21, 2023, 2:26 PM IST

గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ కూలిపోయిన వంతెనపై నుండి డ్రైవింగ్ చేసి మునిగిపోయాడో వ్యక్తి. దీంతో అతని కుటుంబం గూగుల్ నిర్లక్ష్యంపై కోర్టులో దావా వేసింది.


అమెరికా : గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే ఒక్కోసారి మిస్ పైర్ అయ్యే ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. డెడ్ ఎండ్ కి తీసుకెళ్లి నిలబెట్టడం.. నది మధ్యలోకి దారి చూపించడం ఇలాంటివి వింటూనే ఉన్నాం. తాజాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సమయంలో కూడా చెరువులోకి దారి చూపించిన ఘటన ఇంకా మరువకముందే అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 

గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ కూలిపోయిన వంతెనపై నుండి కారును నడుపుతూ వెళ్లిన వ్యక్తి మరణించిన ఘటన నార్త్ కరోలినాలో వెలుగు చూసింది. దీంతో ఆ వ్యక్తి కుటుంబం, సాంకేతిక దిగ్గజం గూగుల్ పై నిర్లక్ష్యం అని దావా వేసింది. వంతెన కూలిపోయిందని తెలిసినా నావిగేషన్ సిస్టమ్‌ను నవీకరించడంలో విఫలమైందని ఆ దావాలో పేర్కొంది. 

Latest Videos

undefined

బిల్లు చూసి దిమ్మతిరిగింది.. క్రాబ్ డిష్ ఆర్డర్ చేస్తే..రూ 56వేలు బిల్లు..

వేక్ కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో మంగళవారం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, ఫిలిప్ పాక్సన్, వైద్య పరికరాల విక్రయదారుడు, ఇద్దరు పిల్లల తండ్రి, సెప్టెంబర్ 30, 2022న అతని జీప్ గ్లాడియేటర్ హికోరీలోని స్నో క్రీక్‌లో పడిపోవడంతో మునిగిపోయాడు. పాక్సన్ తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు పార్టీ నుండి ఇంటికి వస్తున్నాడు. ఆ ప్రాంతం కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ను అనుసరించాడు. తొమ్మిదేళ్ల క్రితం కూలిపోయిన ఓ వంతెన మీదినుంచి గూగుల్ మ్యాప్స్ దారి చూపించింది. 

ఆ మ్యాప్ ప్రకారం ఫాలో అవ్వడంతో అతని కారు ప్రమాదానికి గురై చనిపోయాడు. దీనిమీద గ్లాడియేటర్ భార్య మాట్లాడుతూ... “మా అమ్మాయిలు తమ తండ్రి ఎలా, ఎందుకు చనిపోయారని అడుగుతున్నారు. వారికెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే జీపీఎస్ డైరెక్షన్స్, కూలిపోయిన వంతెన మీదినుంచి చూపించడం.. తన చావుకు కారణమని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను.  ఈ నిర్లక్ష్యం ఖరీదు మా కుటుంబ పెద్ద ప్రాణం. మా కుటుంబం భవిష్యత్తు.. అంటే వారికి మానవ జీవితం పట్ల పెద్దగా గౌరవం లేదు”అని భార్య అలీసియా పాక్సన్ అన్నారు.

అతను ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తాపడింది, పాక్షికంగా మునిగిపోయింది. నార్త్ కరోలినా స్టేట్ పెట్రోల్ ఈ వంతెన స్థానిక లేదా రాష్ట్ర అధికారులచే నిర్వహించబడడం లేదని.. అది అసలు డెవలపర్ కంపెనీ రద్దు చేయబడిందని పేర్కొంది. దావా అనేక ప్రైవేట్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీల పేర్లను పేర్కొంది.

పాక్సన్ మరణానికి దారితీసిన ఈ వంతెన గురించి మ్యాప్స్ లో చూపించడాన్ని చాలా మంది అంతకు ముందే గూగుల్ కి ఫిర్యాదు చేశారు. ఈ దావా ప్రకారం, దాని రూట్ సమాచారాన్ని నవీకరించమని కంపెనీని కోరారు. మంగళవారం కోర్టు ఫైలింగ్‌లో కుప్పకూలిన వంతెనపై డ్రైవర్‌లను నిర్దేశిస్తున్నట్లు కంపెనీని హెచ్చరించడానికి సెప్టెంబరు 2020లో మ్యాప్‌లోని “సవరణను సూచించండి” ఫీచర్‌ని ఉపయోగించిన మరొక హికోరీ నివాసి నుండి ఇమెయిల్ రికార్డ్‌లు కూడా జతచేశారు. 

దీనికి గూగుల్ నవంబర్ 2020 ఇమెయిల్ నిర్ధారణ కంపెనీ తన నివేదికను స్వీకరించిందని, సూచించిన మార్పును సమీక్షిస్తోందని నిర్ధారిస్తూ రిప్లై కూడా ఇచ్చింది. అయితే గూగుల్ తదుపరి చర్యలు తీసుకోలేదని దావా పేర్కొంది.

"పాక్సన్ కుటుంబం పట్ల మాకు ప్రగాఢ సానుభూతి ఉంది" అని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. "మ్యాప్స్‌లో ఖచ్చితమైన రూటింగ్ సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం, మేము ఈ వ్యాజ్యాన్ని సమీక్షిస్తున్నాం" అన్నారు. 

click me!