కరోనా ఎఫెక్ట్: వుహాన్‌లో 73 రోజులుగా ఒకే గదిలో ఇండియన్

By narsimha lode  |  First Published Apr 10, 2020, 2:32 PM IST

చైనా దేశంలోని వుహాన్ లో 73 రోజులుగా ఒక ఇండియన్ ఒక గదిలోనే ఉన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని  నివారించేందుకు గాను వుహాన్ లో 76 రోజుల పాటు  లాక్ డౌన్ ను విధించారు. ఈ నెల 8వ తేదీన లాక్‌డౌన్ ను ఎత్తివేసిన విషయం తెలిసిందే.


వుహాన్: చైనా దేశంలోని వుహాన్ లో 73 రోజులుగా ఒక ఇండియన్ ఒక గదిలోనే ఉన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని  నివారించేందుకు గాను వుహాన్ లో 76 రోజుల పాటు  లాక్ డౌన్ ను విధించారు. ఈ నెల 8వ తేదీన లాక్‌డౌన్ ను ఎత్తివేసిన విషయం తెలిసిందే.

చైనాలోని వుహాన్ లో ఉంటున్న భారతీయుడు అరుణ్‌జిత్ టిసత్రజిత్ ఒకే గదిలో 73 రోజుల పాటు ఉన్నాడు. కేరళకు చెందిన ఆయన వుహాన్ లో హైడ్రోబయాలజిస్టుగా పనిచేస్తున్నారు.

Latest Videos

undefined

వుహాన్ లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ కు వస్తే  తన ద్వారా కుటుంబసభ్యులకు వైరస్ ముప్పు పొంచి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే తాను రావడం లేదని ఆయన తెలిపారు.

also read:సౌదీ రాజకుటుంబంలో పలువురికి కరోనా, 150 మంది క్వారంటైన్ కు

లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమై చాలా రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడకపోవడంతో ఇప్పుడు తాను సరిగా మాట్లాడలేకపోతున్నట్టుగా ఆయన చెప్పారు.  ఈ మేరకు ఓ  న్యూస్ ఏజెన్సీతో ఆయన మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ బయటపడింది. చైనా నుండి ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.అమెరికాతో, యూకే, స్పెయిన్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

click me!