కరోనా నుంచి కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

By telugu news teamFirst Published Apr 10, 2020, 7:36 AM IST
Highlights

ప్రధాని బోరిస్ కు కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వ్యాధి ఎక్కువ అవుతుండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరగుపడింది. చికిత్స అందిస్తున్న ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, కానీ..కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. చికిత్స అందివ్వాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. 

Also Read సౌదీ రాజకుటుంబంలో పలువురికి కరోనా, 150 మంది క్వారంటైన్ కు...

కాగా.. బ్రిటన్ లో కరోనా బీభత్సం సృష్టించింది. ప్రధాని బోరిస్ కు కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వ్యాధి ఎక్కువ అవుతుండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా విజృంభించడంతో ఏడు వేలకు పైగా మృతి చెందారు. 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు బ్రిటన్ లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. ఇప్పటికీ కరోనా కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తోంది బ్రిటన్ మంత్రివర్గం.

click me!