కాబూల్ దాడి... ట్రాజెడిక్ మిస్టేక్ అన్న అమెరికా..!

By telugu news teamFirst Published Sep 18, 2021, 9:08 AM IST
Highlights

ఆ డ్రోన్ దాడిపై తాము దర్యాప్తు చేశామని.. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించామని అమెరికా చెప్పింది. ఆ దాడిలో ఏడుగురు పిల్లలతో సహా.. 10మంది ప్రాణాలు కోల్పోయారని యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ చెప్పారు.

ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఆగస్టు 29న అమెరికా డ్రోన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఢ్రోన్ దాడిలో చిన్నారులు సహా 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘటనపై అమెరికా స్పందించింది.  ఈ ఘటన ట్రాజెడిక్ మిస్టేక్ అంటూ అమెరికా పేర్కొంది.

ఆ డ్రోన్ దాడిపై తాము దర్యాప్తు చేశామని.. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించామని అమెరికా చెప్పింది. ఆ దాడిలో ఏడుగురు పిల్లలతో సహా.. 10మంది ప్రాణాలు కోల్పోయారని యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ చెప్పారు.

ఈ ఘటనపై జనరల్ కెన్నెత్ మెకెంజీ మాట్లాడారు. ఈ దాడిలో  చనిపోయిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలోని  తమ బలగాలకు ముప్పు ఉందని వచ్చిన సమాచారంతో ఈ దాడి చేసినట్లు చెప్పారు.  ఇది  తమ తప్పు అని.. ఈ ఘటనకు తాము మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు తాము పూర్తిగా బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. 

కాగా.. గత నెల ఆగస్టు 29న కాబూల్ ఎయిర్ పోర్టులో రాకెట్ దాడి జరిగింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వైపు ఐదు రాకెట్లు ప్రయోగించబడినట్లు విమానాశ్రయంలో ఉన్న మిసైల్ ఢిఫెన్స్ వ్యవస్థ గుర్తించింది. కాబూల్ లోని కహనా ఏరియా నుంచి మొత్తం ఆరు రాకెట్లు ప్రయోగించబడగా..ఇందులో ఐదు ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ప్రయోగించబడ్డాయని..వీటిని మిసైల్ ఢిఫెన్స్ సిస్టమ్ గుర్తించి పేల్చేశారు. 

click me!