స్కూల్ లో నగ్నంగా విద్యార్థుల నృత్యాలు

First Published Jun 1, 2018, 9:46 AM IST
Highlights

నెట్టింట వైరల్ గా మారిన వీడియోలు

స్కూల్స్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ జరగడం సహజం. వీటిల్లో స్టూడెంట్స్ ఆసక్తిగా కూడా పాల్గొంటారు. అయితే.. ఓ స్కూల్ లో మాత్రం పిల్లలతో నగ్నంగా నృత్యాలు చేయించారు. వాళ్లు అలా నగ్నంగా డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీసి నెట్టింట్లో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌లో గత వారం ఈ ఘటన జరిగింది. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు.. సాంప్రదాయిక ఖ్సోసా నృత్యంలో భాగంగా టాప్‌ లెస్‌గా మారి నృత్యాలు చేశారు. డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత. ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీనిపై తల్లిదండ్రులుసహా ప్రజలు భగ్గుమన్నారు. 

అయితే వారేం పూర్తి నగ్నంగా దృశ్యాలు చేయలేదని, సాంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారని స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది.  ఘటనపై విద్యాశాఖ మంత్రి అంగీ మోట్షేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపులేనని ఆమె అన్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

ఇదిలా ఉంటే అర్థనగ్న దృశ్యాలు దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతిల్లో భాగమే. రీడ్‌ నృత్యాల పేరిట టాప్‌ లెస్‌గా ఉన్న అమ్మాయిలు రాజ వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఓ ఆనవాయితీగా ఉండేది. కానీ, తర్వాత ఆ సంప్రదాయాలు కనుమరుగు అయిపోయాయి. ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి ఆచరణలో తెచ్చేందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో(రోజుకు 150కి పైగా రేప్‌ కేసుల నమోదు) ఇలాంటి వాటిని ప్రొత్సహించలేమని, చట్టబద్ధం చేయటం కుదరదని ప్రభుత్వం తేల్చేసింది.

click me!