ఓటమి ఎరుగని బాక్సర్.. రింగ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన ముసా యమక్.. షాకింగ్ వీడియో

Published : May 19, 2022, 07:07 PM ISTUpdated : May 19, 2022, 07:09 PM IST
ఓటమి ఎరుగని బాక్సర్.. రింగ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన ముసా యమక్.. షాకింగ్ వీడియో

సారాంశం

ఆయన ఓటమి ఎరుగని బాక్సర్. ఆయన పాల్గొన్న అన్ని ఫైట్స్‌లలో గెలిచాడు. కానీ, తాజాగా, ఉగాండాకు చెందిన హంజాతో రింగ్‌లోకి దిగాడు. ఈ పోటీలో మూడో రౌండ్‌కు సిద్ధం అవుతూ హార్ట్ ఎటాక్ వచ్చి రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు.

న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రపంచంలో చాంపియన్‌గా పేరు సంపాదించుకున్న, ఇప్పటి వరకు ఓటమి అనేది ఎరుగని జర్మనీ బాక్సర్ ముసా యమక్ ఒక్కసారిగా బాక్సింగ్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. జర్మనీ రాజధాని మ్యూనిచ్‌లో జరుగుతున్న పోటీల్లో 38 ఏళ్ల జర్మనీ చాంపియన్ ఉగాండాకు చెందిన హంజా వండేరాతో తలపడ్డాడు. రెండు రౌండ్లు ముగిశాయి. మూడో రౌండ్ బెల్ ఇంకా మోగకముందే.. ఆయన ఫైటింగ్‌కు సిద్ధం అవుతుండగా ఉన్నట్టుండి రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. మళ్లీ లేవలేదు. వెంటనే పారామెడికల్ సిబ్బంది..ఆయన వద్దకు పరుగులు పెట్టారు. ఫైటింగ్‌కు సిద్ధం చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన లేవలేదు. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే హార్ట్ అటాక్‌తో మరణించినట్టు వైద్యులు తేల్చేశారు.

తొలి రౌండ్‌లో ముసా యమక్ మెరుగ్గా ప్రదర్శన ఇచ్చాడు. కానీ, సెకండ్ రౌండ్‌లో మాత్రం హంజా నుంచి తీవ్ర దాడి ఎదుర్కొన్నాడు. రెండో రౌండ్ చివరిలో ఘోరమైన పంచ్ పడింది. ఆ తర్వాత ఇరువురూ కొంత విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ మూడో రౌండ్‌కు సిద్ధం అయ్యారు. ఇద్దరూ రింగ్‌లో పొజిషన్ తీసుకుంటున్నారు. ఇంకా బెల్ రింగ్ కాలేదు. కానీ, హఠాత్తుగా ముసా యమక్ కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అభిమానుల నుంచి అరుపులు వినిపించాయి. క్షణాల్లో గంభీర వాతావరణం నెలకొంది. ప్యారామెడిక్స్ రంగంలోకి దిగారు. కానీ, ఆయన కోలుకోకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయిందని వైద్యులు చెప్పారు. అభిమానుల కోసం ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు లైవ్ స్ట్రీమ్ పెట్టినట్టు చెప్పారు. 

ముసా యమక్ మరణం బాక్సింగ్ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. అలుక్రాకు చెందిన ముసా యమక్ అజేయ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఓటమి అనేది ఎరుగనివాడు. తాను పోటీ చేసిన 75 ఫైటింగ్‌లలో ఆయన అన్ని గెలుపొందాడు. 2017లో ముసా యమక్ ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యాడు. 2021లో డబ్ల్యూబీ ఇంటర్నేషనల్ టైటిల్ సాదించాడు. ఆ గెలుపుతో ఆయన బాక్సింగ్ ప్రపంచంలో ఒక పాపులర్ ఫిగర్‌గా ఎదిగాడు. ఈయన టర్కిష్ కుటుంబంలో జన్మించాడు.

టర్కిష్ అధికారి హసన్ తురణ్.. ముసా యమక్ మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?