
న్యూఢిల్లీ: ఆమె మానసికంగా కొంత కుంగుబాటు అనుభవిస్తున్నది. సరైన కేరింగ్ అందక తరుచూ ఎమోషనల్ అవుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేస్తుంది. తన మానసిక అనారోగ్యానికి చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్ వెళ్లింది. వైద్యుడి కన్సల్టేషన్ కోసం ఎదురుచూసింది. ఆ తర్వాత తన అనారోగ్యం గురించి వైద్యుడితో చెప్పడానికి వెళ్లింది. ఈ కన్సల్టేషన్ సమయంలో ఆమె కొంత ఎమోషనల్ అయింది. ఏడ్చేసింది. తీరా బయటకు వచ్చి చూస్తే.. తన ఏడుపు గురించి వైద్యుడు అడగనే లేదు. కానీ, ఏడ్చినందుకు 40 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3100)లు బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు చూసి ఆమె ఖంగుతింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఈ బిల్లు రశీదును ఆమె సోదరి, ప్రముఖ యూట్యూబర్ కెమిలీ జాన్సన్ తన ట్విట్టర్ అకౌంట్‌తో పోస్టు చేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ఓ త్రెడ్ రాసుకొచ్చింది. తన సోదరి ఓ అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వివరించింది. ఆ బిల్లు ప్రకారం కెమిలీ జాన్సన్ సోదరి జనవరిలో వైద్యుడిని సంప్రదించింది. అందులో అనేక పరీక్షలతోపాటు ఏడ్చినందుకు కూడా బిల్లు వేసినట్టు కనిపించింది. అయితే, ఆ ఏడుపును సమీక్షించినట్టు తర్వాత వాదనలు వచ్చాయి. కానీ, తన సోదరిని ఏడ్చినందుకు కనీసం ఆరా కూడా తీయలేదని తిప్పికొట్టింది.
ఒక్క కన్నీటి చుక్కకు 40 డాలర్లు వసూలు చేశారని, కనీసం ఎందుకు ఏడ్చారని, ఏడుపు వెనుక కారణాలైనా వారు అడగలేదని పేర్కొంది. ఆ బిహేవియర్‌ను కూడా పరీక్షించలేదని వివరించింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వలేదని తెలిపింది.
స్కూల్ గర్ల్స్ భీకరంగా దాడి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై.. ఓ స్కూల్ భవనానికి అపోజిట్‌లో బాలికలు రెండు గ్యాంగ్‌లు వచ్చి చేరారు. కొందరు స్కూల్ యూనిఫామ్‌లో ఉండగా, ఇంకొందరు క్యాజువల్ డ్రెస్‌లలో ఉన్నారు. ఆ రెండు గ్యాంగ్‌లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ రోడ్డు పక్కన కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ కార్ల పక్కనే పేవ్‌మెంట్‌పై స్ట్రీట్ ఫైట్ మొదలైంది. కొందరు అందులో జుట్టు పట్టుకుని లాగారు. ఇంకొందరు నెట్టేసి కింద పడేశారు. మరికొందరు కర్రలతో దాడి చేశారు. పెద్దగా అరుపులు వినరావడంతో స్థానికులు అక్కడికి పరుగున చేరారు. కానీ, ఆ స్కూల్ గర్ల్స్ మాత్రం దాడి చేయకుండా ఆగలేదు. దీంతో స్థానికులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. కొందరు వారిని హెచ్చరించి అక్కడి నుంచి హడలగొట్టి పంపించేశారు. ఈ దాడి తర్వాత చాలా మంది పిల్లలు గాయపడ్డట్టు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఒకరు రికార్డ్ చేశారు. కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.