కశ్మీర్ పై భద్రతామండలి సమావేశం: భారత్ కు రష్యా మద్దతు, పాక్ కు చైనా

By Nagaraju penumalaFirst Published Aug 16, 2019, 9:39 PM IST
Highlights

ఆర్టికల్ 370 రద్దుతో భారత్ జమ్ముకశ్మీర్ కు తీవ్ర అన్యాయం చేస్తోందని అంతర్జాతీయ వివాదానికి తెరలేపిందంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. అమెరికాకు సైంత ఫోన్ చేసి జమ్ముకశ్మీర్ అంశంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు మద్దతు ప్రకటించింది చైనా. జమ్ముకశ్మీర్ అంశంపై జరిగిన చర్చలో భారత్ పై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ పట్ల భారత ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చైనా వాదించింది. 

ఆర్టికల్ 370 రద్దుతో భారత్ జమ్ముకశ్మీర్ కు తీవ్ర అన్యాయం చేస్తోందని అంతర్జాతీయ వివాదానికి తెరలేపిందంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. అమెరికాకు సైంత ఫోన్ చేసి జమ్ముకశ్మీర్ అంశంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. చైనా వాదనతో రష్యా పూర్తిగా విబేధించింది. రష్యా భారత్ కు మద్దతుగా నిలిచింది. కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. ఆ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చించడం సరికాదని అభిప్రాయపడింది.  

అటు అమెరికా సైతం కశ్మీర్‌ విషయం పూర్తిగా భారత్‌ అంతర్గతమని తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన ఫ్రాన్స్‌, యూకే కూడా కశ్మీర్‌ అంశం భారత్‌-పాకిస్తాన్‌ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

click me!