రష్యాను ఆపండి : మరోసారి భారత సాయం కోరిన ఉక్రెయిన్, ఇండియా సమాధానం ఇదే..!

Siva Kodati |  
Published : Feb 26, 2022, 03:22 PM ISTUpdated : Feb 26, 2022, 03:24 PM IST
రష్యాను ఆపండి : మరోసారి భారత సాయం కోరిన ఉక్రెయిన్, ఇండియా సమాధానం ఇదే..!

సారాంశం

భార‌త్ సాయాన్ని మ‌రోసారి కోరింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి (ukraine foreign minister) డిమిట్రో కులేబ (dmytro kuleba) తాజాగా భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కు (s jaishankar)  ఫోన్ చేసి, ర‌ష్యాతో దౌత్య సంబంధాలను ఉపయోగించి ఎలాగైనా దాడుల‌ను ఆపాల‌ని అభ్యర్ధించారు.  

ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు ర‌ష్యా బలగాలు కీవ్‌లో పాగా వేసిన విష‌యం తెలిసిందే. ఏ క్ష‌ణంలోనైనా ఉక్రెయిన్ ప్ర‌భుత్వ అధికారిక భవనాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకునే అవ‌కాశం ఉంది. ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఘటనలో పలువురు సామాన్యులు కూడా మరణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ సాయాన్ని మ‌రోసారి కోరింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి (ukraine foreign minister) డిమిట్రో కులేబ (dmytro kuleba) తాజాగా భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కు (s jaishankar)  ఫోన్ చేసి, ర‌ష్యాతో దౌత్య సంబంధాలను ఉపయోగించి ఎలాగైనా దాడుల‌ను ఆపాల‌ని అభ్యర్ధించారు.

అలాగే, ఐక్యరాజ్య సమితి (united nations) భద్రతా మండలిలో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాల‌ని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు నుంచి ఆయా విష‌యాల్లో భార‌త్ త‌ట‌స్థంగా ఉంటోన్న విష‌యం తెలిసిందే. దీంతో దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ సూచించారు. భారతదేశం దీన్నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు జైశంక‌ర్ ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు..ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడో రోజుకు చేరాయి. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తున్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆ దేశ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీకి ఓ ఆఫర్ ఇచ్చింది. కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు.

‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ (volodymyr zelensky ) చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.

అంతకుముందు ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై దాడి గురించి 12 దేశాలు సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కానీ, చైనా, ఇండియా, యూఏఈ అందులో పాల్గొనలేదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యాకు వీటో పవర్ ఉండటంతో ఆ తీర్మానం విఫలం అయింది. అయితే, ఈ తీర్మానంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. 12 దేశాలు ఈ తీర్మానం ప్రవేశపెట్టడం హర్షనీయం అని, అంటే.. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌తోనే ఉన్నాయనే విషయం స్పష్టం అవుతున్నదని వివరించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే