Ukraine Russia Crisis: బార్కెస్‌లో ఎయిర్ ఢిపెన్స్ పునరుద్దరణ

Published : Feb 27, 2022, 10:53 AM IST
Ukraine Russia Crisis: బార్కెస్‌లో ఎయిర్ ఢిపెన్స్ పునరుద్దరణ

సారాంశం

ఉక్రెయిన్ ‌లోని ఒడెసాలో  ఎయిర్  రక్షణ వ్యవస్థ పునురుద్దరించినట్టుగా నివేదికలు వెల్లడించాయి.  ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది రష్యా.

కీవ్:Ukraine లోని Odesa లో  వాయు రక్షణ వ్యవస్థ పునరుద్దరించినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. ఉక్రెయిన్ సాయుధ దళాల వాయు రక్షణ వ్యవస్థ పనిచేస్తోంది. ఈ మేరకు  రీజినల్ స్టేట్ ఆడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ కౌన్సిల్ హెడ్ బ్రాట్ చుక్ నివేదించింది.

ఉక్రెయిన్ రాజధాని Kvivపై పట్టు సాధించేందుకు  రష్యా ప్రయత్నిస్తోంది. అయితే Russia ను ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.  కీవ్ పట్టణంో కర్ఫ్యూను విధించారు. సోమవారం వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని కీవ్ నగర మేయర్ తెలిపారు. ఉక్రెయిన్   రాజ‌ధాని కీవ్  నగరంలో  క‌ర్ఫ్యూ   విధిస్తున్న‌ట్టు  మేయర్ విటాలీ క్లిట్ష్కో  శనివారం ప్ర‌క‌టించారు. రష్యా దళాలు కైవ్ పై దాడిని కొన‌సాగిస్తుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు క్లిట్ష్కో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో కర్ఫ్యూ వివ‌రాలు వెల్ల‌డించిన‌ట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. కర్ఫ్యూ సమయంలో వీధిలో ఉన్న పౌరులందరూ శత్రువుల విధ్వంసం, నిఘా సమూహాలలో సభ్యులుగా పరిగణించబడతారని క్లిట్ష్కో చెప్పారు. అలాగే కర్ఫ్యూ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 8 గంటల పెంచారు. ఇది గ‌తంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగింది.

 మిలిటరీ, మా నేషనల్ గార్డ్, మా నేషనల్ పోలీస్, మా టెరిటరీ డిఫెన్స్, స్పెషల్ సర్వీస్, ఉక్రెయిన్ జాతీయుల్లో  స్పూర్తిని నింపే ప్రయత్నాలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.   పోరాటం కొనసాగించండి. మ‌న‌మే గెలుస్తామని ఆయన కోరారు.శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని ఆయన తెలిపారు. మనం మన నేలను, మన పిల్లల భవిష్యత్తును రక్షించుకుంటున్నామని మనకు తెలుసు. కైవ్,  కీలక ప్రాంతాలు మన సైన్యం నియంత్రణలో ఉన్నాయి. కబ్జాదారులు వారి కీలుబొమ్మను మన రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ వారు విజయవంతం కాలేరని  జెలెన్ స్కీ  ప్రకటించారు. 

ఈ నెల 26న  UNO  భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై దాడి గురించి 12 దేశాలు సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  చైనా, ఇండియా, యూఏఈ అందులో పాల్గొనలేదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యాకు వీటో పవర్ ఉండటంతో ఆ తీర్మానం విఫలం అయింది. అయితే ఈ తీర్మానంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. 12 దేశాలు ఈ తీర్మానం ప్రవేశపెట్టడం హర్షనీయమని ఆయన ప్రకటించారు.  ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌తోనే ఉన్నాయనే విషయం స్పష్టం అవుతున్నదని వివరించారు.

ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండిస్తూ ర‌ష్యా తన దళాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ రష్యా  త‌న వీటో అధికారాన్ని ఉప‌యోగించింది. భద్రతా మండలి 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మానాన్ని తిరస్కరించింది. భార‌త్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐక్య రాజ్య స‌మితిలోని భద్రతా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాయి. వెంట‌నే ఉక్రెయిన్ నుంచి ర‌ష్యా ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే