Ukraine Russia Crisis: ఖార్కివ్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేల్చివేసిన రష్యా

Published : Feb 27, 2022, 09:27 AM ISTUpdated : Feb 27, 2022, 10:43 AM IST
Ukraine Russia Crisis: ఖార్కివ్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేల్చివేసిన రష్యా

సారాంశం

ఉక్రెయిన్ దేశంలోని పలు నగరాలపై రష్యా తన పట్టును సాధించే ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలోనే ఖార్కివ్ నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ను రష్యా పేల్చి వేసింది.   

కీవ్:  Russia దళాలు Ukraine దేశంలో అతి పెద్ద నగరమైన Kharkivలో గ్యాస్ పైప్‌లైన్ ను పేల్చి వేసినట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది.ఈ Gas Pipe line పైప్‌లైన్ పేలుడు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉక్రెయిన్ స్టేట్ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ పలు సూచనలు చేసింది. కిటికీలు, తలుపులను తడిబట్ట లేదా గాజుగుడ్డతో కప్పి ఉంచాలని సూచించింది.

రష్యా దళలు ఖార్కివ్ ను స్వాధీనం చేసుకోలేకపోయాయని ఉక్రెయిన్ టాప్ ప్రాసిక్యూటర్  ఇరినా వెనెడిక్టోవా చెప్పారు.ఖార్కివ్ నగరం రష్యన్ సరిహద్దు నుండి 40 కి.మీ. దూరంలో ఉంది.

ఈ నెల 26న  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై దాడి గురించి 12 దేశాలు సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  చైనా, ఇండియా, యూఏఈ అందులో పాల్గొనలేదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యాకు వీటో పవర్ ఉండటంతో ఆ తీర్మానం విఫలం అయింది. అయితే ఈ తీర్మానంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. 12 దేశాలు ఈ తీర్మానం ప్రవేశపెట్టడం హర్షనీయమని ఆయన ప్రకటించారు.  ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌తోనే ఉన్నాయనే విషయం స్పష్టం అవుతున్నదని వివరించారు.

ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండిస్తూ ర‌ష్యా తన దళాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ రష్యా  త‌న వీటో అధికారాన్ని ఉప‌యోగించింది. భద్రతా మండలి 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మానాన్ని తిరస్కరించింది. భార‌త్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐక్య రాజ్య స‌మితిలోని భద్రతా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాయి. వెంట‌నే ఉక్రెయిన్ నుంచి ర‌ష్యా ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

ఉక్రెయిన్   రాజ‌ధాని కీవ్  నగరంలో  క‌ర్ఫ్యూ   విధిస్తున్న‌ట్టు  మేయర్ విటాలీ క్లిట్ష్కో  శనివారం ప్ర‌క‌టించారు. రష్యా దళాలు కైవ్ పై దాడిని కొన‌సాగిస్తుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు క్లిట్ష్కో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో కర్ఫ్యూ వివ‌రాలు వెల్ల‌డించిన‌ట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. కర్ఫ్యూ సమయంలో వీధిలో ఉన్న పౌరులందరూ శత్రువుల విధ్వంసం, నిఘా సమూహాలలో సభ్యులుగా పరిగణించబడతారని క్లిట్ష్కో చెప్పారు. అలాగే కర్ఫ్యూ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 8 గంటల పెంచారు. ఇది గ‌తంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగింది.

మా మిలిటరీ, మా నేషనల్ గార్డ్, మా నేషనల్ పోలీస్, మా టెరిటరీ డిఫెన్స్, స్పెషల్ సర్వీస్, ఉక్రెయిన్ జాతీయుల్లో  స్పూర్తిని నింపే ప్రయత్నాలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.   పోరాటం కొనసాగించండి. మ‌న‌మే గెలుస్తామని ఆయన కోరారు.శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని ఆయన తెలిపారు. మనం మన నేలను, మన పిల్లల భవిష్యత్తును రక్షించుకుంటున్నామని మనకు తెలుసు. కైవ్,  కీలక ప్రాంతాలు మన సైన్యం నియంత్రణలో ఉన్నాయి. కబ్జాదారులు వారి కీలుబొమ్మను మన రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ వారు విజయవంతం కాలేరని  జెలెన్ స్కీ  ప్రకటించారు. 

 

 


 

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే