కొమొరోస్ లో కుప్ప‌కూలిన విమానం.. 14 మంది ఆచూకీ గ‌ల్లంతు

Published : Feb 27, 2022, 03:33 AM IST
కొమొరోస్ లో కుప్ప‌కూలిన విమానం.. 14 మంది ఆచూకీ గ‌ల్లంతు

సారాంశం

కొమొరోస్ లో చిన్న సెస్నా విమానం కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో 14 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

14 మందితో ప్ర‌యాణిస్తున్న చిన్న సెస్నా విమానం (Cessna plane) హిందూ మహా సముద్ర ద్వీపసమూహంలో భాగమైన కొమొరోస్ (Comoros)లో శ‌నివారం కుప్ప‌కూలింది. ఇందులో ప్ర‌యాణిస్తున్న వారి ఆచూకీ కోసం సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. 

ఎయిర్‌లైన్ AB ఏవియేషన్ (Airline AB Aviation)కు చెందిన చిన్న సెస్నా (Cessna plane) విమానం మొరోని (Moroni) నుంచి మొహెలీ (Moheli) ద్వీపంలోని ఫోంబోని (Fomboni) న‌గ‌రం మ‌ధ్య ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అధికారులు తెలుపుతున్నారు. సెస్నా విమానం త‌న గ‌మ్యస్థానం నుంచి బ‌య‌లు దేరి 2.5 కిలోమీటర్లు (1.6 మైళ్ళు) వెళ్లిన త‌రువాత రాడార్ నుంచి అనుసంధానం నిలిచిపోయింది. 

సెస్నా విమానం కూలిపోయిన్న‌ట్టు కొమోరియన్ ర‌వాణా మంత్రిత్వ శాఖ (Comorian transport ministry) గుర్తించింది. డిజోయిజీ (Djoiezi) తీర ప్రాంతంలో విమానం శిథిలాలను కనుగొనడం ప్రారంభించాయి అని మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌నతో తెలిపింది. ఈ విమానంలో ఉన్న 14 మందిలో 12 మంది ప్రయాణికులు కొమోరియన్ అని, ఇద్దరు పైలట్లు టాంజానియాకు చెందినవారని కొమోరియన్ ప్రభుత్వం తెలిపింది.

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సీనియర్ పోలీసు అధికారి అబ్దెల్-కాదర్ మొహమ్మద్ (Abdel-Kader Mohamed) మాట్లాడుతూ.. మూడు స్పీడ్ బోట్‌లను క్రాష్ సైట్‌కు పంపించామని తెలిపారు. విమానం నుంచి శిథిలాలు, ప్రయాణీకులకు చెందిన వస్తువులను సేకరించడానికి మాకు అనుమతులు వ‌చ్చాయిని చెప్పారు. రేపు త‌మ శోధ‌న‌ను కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. త‌మ‌కు మృతదేహాలు లభించనంత కాలం ఆశ ఉంద‌ని చెప్పారు. 

మొహెలీ, మొరోని గ్రాండే కొమోర్ ద్వీపంలో బాధిత కుటుంబాలకు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు అందిస్తోంది. ‘‘నాకు ఎలాంటి ఆశా లేదు. రేపటి నుండి మేము నా సోదరికి సంతాపాన్ని ప్రారంభింస్తాం.’’ అని ప్ర‌యాణికుల‌లో ఒక సోద‌రిని క‌లిగి ఉన్న ఇడి బోయినా (Idi Boina) మోరోనిలో AFP కి చెప్పారు. విమానం కుప్ప‌కూలిన ప్ర‌దేశం నుంచి పొరుగున ఉన్న ఫ్రెంచ్ భూభాగం అయిన మయోట్ నుండి సహాయం కోరినట్లు అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే