Ukraine war : చాసివ్ యార్ సిటీని ఢీకొట్టిన రష్యా క్షిపణి.. 15 మంది మృతి..

Published : Jul 11, 2022, 07:49 AM IST
Ukraine war : చాసివ్ యార్ సిటీని ఢీకొట్టిన రష్యా క్షిపణి.. 15 మంది మృతి..

సారాంశం

ఉక్రెయిన్, రష్యాకు మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా ఆగడం లేదు. రష్యా నిరంతరం ఉక్రెయిన్ లోని నగరాలపై దాడులు జరుపుతూనే ఉంది. అయితే వీటిని ఉక్రెయిన్ దళాలు అడ్డుకుంటున్నాయి. కానీ తాజాగా డోన్‌బాస్ ప్రాంతంలోని చాసివ్ యార్ సిటీని రష్యా మిస్సైల్ ఢీ కొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 15 మంది చనిపోయారు.   

తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంపై త‌మ ప‌ట్టును పెంచుకునేందుకు ర‌ష్యా ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగానే ఆ ప్రాంతంలో ఉన్న చాసివ్ యార్ ప‌ట్ట‌ణంపై ఆదివారం మిస్సైల్ తో దాడి చేసేంది. ఈ మిస్సైల్ ఓ అపార్టెమెంట్ పై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 15 మంది చ‌నిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ‘‘ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఘటనా స్థలంలో 15 మృతదేహాలు లభించాయి. ఐదుగురు వ్యక్తులను శిథిలాల కింది నుంచి బయటకు తీశారు.’’  స్థానిక ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్ ఫేస్ బుక్ లో పేర్కొంది. 

Sri Lanka Crisis: శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుంది: కేంద్ర విదేశాంగ శాఖ

రష్యన్ ఉరగన్ క్షిపణి ఢీకొనడంతో నాలుగు అంతస్థుల భవనం శిథిలాల కింద కనీసం 30 మంది ఉన్నారని డొనెట్స్క్ ప్రాంతీయ గవర్నర్ పావ్లో కైరిలెంకో టెలిగ్రామ్‌లో తెలిపారు.  ఈ దాడితో ఆ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల కింద ఉన్న వారిని ర‌క్షించేందుకు సైనికులు వేగంగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న ముగ్గురితో సైనికులు కమ్యునికేట్ చేసుకోగ‌లిగార‌ని ఎమర్జెన్సీ స‌ర్వీస్ తెలిపింది. 

డోనెట్స్క్ ప్రాంతం నిరంతరంపై కాల్పులు జ‌రుగుతున్నాయి. అయితే రష్యా భూమి పై నుంచి చేసే దాడుల‌ను త‌మ సైనికులు నిలువ‌రించార‌ని ఉక్రేనియన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం చెప్పారు. అయితే ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ఖేర్సన్‌లోని రష్యా స్థావరాన్ని తాకినట్లు వారు వివరించలేదు. శనివారం డోనెట్స్క్‌లో జ‌రిగిన షెల్లింగ్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 23 మంది గాయపడ్డారని గవర్నర్ కైరిలెంకో తెలిపారు. ప్రాంతీయ గవర్నర్ ఒలేగ్ సినెగుబోవ్ ప్రకారం.. ఈశాన్య ప్రాంతంలో ఉక్రెయిన్ రెండవ నగరమైన ఖార్కివ్‌లో కూడా సమ్మెలు నమోదయ్యాయి. 

Sri Lanka Crisis: అధికారిక భవనాల్లో నిరసనకారులు.. పీఎం బెడ్ పై WWE ఫైట్ వీడియో వైరల్.. నిరసనలా? పిక్నిక్ టూరా?

కాగా శనివారం రాత్రి ఒక ప్రసంగంలో జెలెన్ స్కీ విస్తృతమైన రష్యన్ బాంబు దాడులను ఖండించారు. కేవలం ఒక రోజులో, రష్యా మైకోలైవ్, ఖార్కివ్, క్రివీ రిహ్, జాపోరిజ్జియా ప్రాంతంలోని కమ్యూనిటీలను తాకింద‌ని చెప‌పారు. రష్యన్ దాడులు పూర్తిగా ఉద్దేశపూర్వకం నివాస ప్రాంతాల‌ను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. ఈ బాంబులు సాధారణ ఇళ్ళు, పౌర వస్తువులు, ప్రజలను తాకినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి తీవ్రవాద చర్యలను నిజంగా ఆధునిక, శక్తివంతమైన ఆయుధాలతో మాత్రమే ఆపవచ్చు అని జెలెన్స్కీ చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ అందించిన దాని సైనిక సహాయ ప్యాకేజీకి ధన్యవాదాల‌ని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?