
ఉక్రెయిన్ కు, రష్యాకు మధ్య భీకరమైన యుద్దం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యాను యుద్ధం విరమించాల్సిందిగా కోరుతున్నాయి. దౌత్య పరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అయినా రష్యా ఎవరి మాట వినిపించుకోవడం లేదు. ఈ యుద్ధంలో రష్యా సేనలు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్. రష్యా సైన్యం ఉక్రెయిన్ చుట్టు ముట్టినా ఎంతో ధైర్యంగా ఒంటరిగా పోరాడుతోంది.
ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ ఓ నిర్ణయం తీసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ కు ఆయుధ డెలివరీలను U-టర్న్ విధానంలో ఆమోదించింది. దీంతో పాటు SWIFT ఇంటర్ బ్యాంక్ సిస్టమ్‌కు మాస్కో యాక్సెస్‌ను పరిమితం చేయడానికి అంగీకరించింది. ‘‘ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చరిత్రలో ఒక మలుపు తిరిగింది. ఇది మన యుద్ధానంతర క్రమాన్ని మొత్తం బెదిరిస్తుంది ’’ అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో మారణాయుధాల పంపిణీకి ఆమోదం తెలిపారు. ‘‘ ప్రస్తుతం నెలకొన్నఈ పరిస్థితిలో వ్లాదిమిర్ పుతిన్ సైన్యం దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మా సామర్థ్యం మేరకు మద్దతు ఇవ్వడం మా కర్తవ్యం ’’ అని ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. జర్మనీ ఉక్రెయిన్ కు దగ్గరగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
సంఘర్షణ ప్రాంతాలకు ఆయుధాల ఎగుమతులను నిషేధించేలనే దాని దీర్ఘకాల విధానం నుండి జర్మనీ మార్పు చేరుసుకొని జర్మని తన బుండెస్‌వెహ్ర్ స్టోర్‌ను తెరుస్తోంది. ఉక్రెయిన్‌కు 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్,, 500 స్టింగర్ క్లాస్ ఉపరితలం నుండి గగనతల క్షిపణులను బదిలీ చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. దీంతో పాటు నెదర్లాండ్స్ మీదుగా ఉక్రెయిన్‌కు 400 యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్‌లను డెలివరీ చేయడానికి కూడా శనివారం ఆమోదం తెలిపింది. ఈ యాంటీ-ట్యాంక్ లాంచర్లను నెదర్లాండ్స్ జర్మనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే వీటిని కైవ్ కు అప్పగించాలంటే జర్మనీ అనుమతి అవసరం. అదే విధంగా.. జర్మనీ నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది పాత హోవిట్జర్‌లను ఉక్రెయిన్‌కు చేయనుంది.
ఈ ఆయుధాలతో పాటు 14 సాయుధ వాహనాలు ఉక్రెయిన్‌కు జర్మనీ అందించనుంది. ఇవి రక్షణ సిబ్బంది తరలింపు కోసం ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలాండ్ ద్వారా ఉక్రెయిన్‌కు 10,000 టన్నుల వరకు ఇంధనం కూడా పంపించనుంది. కాగా రష్యా దండయాత్రను ఎదుర్కోవడానికి ఆయుధాలను పంపాలని ఉక్రెయిన్ కొన్ని వారాలుగా జర్మనీని వేడుకుంటోంది. ఉక్రెయిన్ కోరిన ఆయుధాల జాబితాలో మధ్య-శ్రేణి యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ రాకెట్ సిస్టమ్‌లు, యాంటీ-డ్రోన్ రైఫిల్స్, మైక్రోవేవ్ డిస్ట్రాండ్ సిస్టమ్‌లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. అయితే వీటిని పంపించడానికి గతంలో జర్మనీ నిరాకరించింది. కేవలం 500 హెల్మెట్లను మాత్రమే పంపించాలని నిర్ణయించింది.
అయితే ప్రస్తుతం ఆ నిర్ణయం మార్చుకుంది. దీనికి కారణం లేకపోలేదు. కొన్ని గంటల ముందు పోలిష్ ప్రధాన మంత్రి మాటెస్జ్ మోరావికీ ఓలాఫ్ స్కోల్జ్ చర్చల కోసం బెర్లిన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో జర్మనీ ఆయుధాల ఎగుమతి వైఖరిపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ ఐదు వేల హెల్మెట్‌లా ? ఇది పెద్ద జోక్ లా కనిపిస్తోంది. వారికి నిజమైన సహాయం కావాలి. ఆయుధాలు కావాలి. ఉక్రెయిన్ కేవలం తన కోసమే పోరాటడం లేదు. మన అందరి కోసం పోరాడుతోంది. మన స్వేచ్చ కోసం, మన సార్వభౌమాధికారం కోసం పోరాడుతోంది. ’’ అని జర్మనీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.