Ukraine Russia Crisis: మా సైన్యం ఆధీనంలోనే కీవ్ తేల్చేసిన ఉక్రెయిన్

Published : Feb 27, 2022, 11:21 AM ISTUpdated : Feb 27, 2022, 11:27 AM IST
Ukraine Russia Crisis: మా సైన్యం ఆధీనంలోనే కీవ్ తేల్చేసిన ఉక్రెయిన్

సారాంశం

కీవ్ పట్టణం తమ సైన్యం ఆధీనంలోనే ఉందని ఉక్రెయిన్ ఆదివారం నాడు ప్రకటించింది. రష్యా దళాలు కీవ్ ను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

కీవ్:  రాజధాని Kviv నగరం పూర్తిగా తమ Army ఆధీనంలోనే ఉందని  Ukraine ఆదివారం నాడు ప్రకటించింది. అయితే కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనేందుకు Russiaప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఉక్రెయిన్ అంతే స్థాయిలో ప్రతిఘటనను కనబరుస్తోంది.శనివారం నాడు విధ్వంసం తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఉక్రెయిన్ ఇవాళ ప్రకటించింది.

రష్యా దళాలపై ఉక్రెయిన్ Petro Bomb లతో విరుచుకు పడుతుంది. పెట్రో బాంబులను ప్రజలు తయారు చేస్తున్నారు.  గత 48 గంటల్లో ఉక్రెయిన్ ను సుమారు 1.20 లక్షల మంది వీడి వెళ్లారని UNO అంచనా వేస్తోంది.ఉక్రెయిన్ కు చెందిన ఇంధన, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు దిగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ ప్రజలు కూడా రష్యాపై తిరగబడుతున్నారు. రష్యాకు చెందిన జెట్ ఫైటర్ ను ఉక్రెయిన్ ఇవాళ కూల్చివేసింది.

రష్యా దళాలు అన్ని వైపుల నుండి ఉక్రెయిన్ రాజధాని వైపునకు వెళ్తున్నాయి. ఆదివారం నాడు తెల్లవారుజామున కీవ్  నగరానికి దక్షిణంగా ఉన్న రెండు పెద్ద పేలుళ్లు చోటు చేసుకొన్నాయని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఉక్రెయిన్ నగరంలోకి రష్యా దళాలు రాకుండా ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనను కొనసాగిస్తుంది.కీవ్ ను విడిచివెళ్లేందుకు అధ్యక్షుడు Zelensky నిరాకరించారు. కీవ్ ను రక్షించుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని జెలెన్‌స్కీ కోరారు.

ఈ నెల 24వ తేదీ నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఉక్రెయిన్ లోని పలు నగరాలను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.   కీవ్ పట్టణంలో కర్ఫ్యూను విధించారు. సోమవారం వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని కీవ్ నగర మేయర్ తెలిపారు. ఉక్రెయిన్   రాజ‌ధాని కీవ్  నగరంలో  క‌ర్ఫ్యూ   విధిస్తున్న‌ట్టు  మేయర్ విటాలీ క్లిట్ష్కో  శనివారం ప్ర‌క‌టించారు. రష్యా దళాలు కైవ్ పై దాడిని కొన‌సాగిస్తుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు క్లిట్ష్కో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో కర్ఫ్యూ వివ‌రాలు వెల్ల‌డించిన‌ట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. కర్ఫ్యూ సమయంలో వీధిలో ఉన్న పౌరులందరూ శత్రువుల విధ్వంసం, నిఘా సమూహాలలో సభ్యులుగా పరిగణించబడతారని క్లిట్ష్కో చెప్పారు. అలాగే కర్ఫ్యూ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 8 గంటల పెంచారు. ఇది గ‌తంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగింది.

 మిలిటరీ,  నేషనల్ గార్డ్, నేషనల్ పోలీస్, టెరిటరీ డిఫెన్స్, స్పెషల్ సర్వీస్, ఉక్రెయిన్ జాతీయుల్లో  స్పూర్తిని నింపే ప్రయత్నాలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.   పోరాటం కొనసాగించండి. మ‌న‌మే గెలుస్తామని ఆయన కోరారు.శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని ఆయన తెలిపారు. మనం మన నేలను, మన పిల్లల భవిష్యత్తును రక్షించుకుంటున్నామని మనకు తెలుసు. కైవ్,  కీలక ప్రాంతాలు మన సైన్యం నియంత్రణలో ఉన్నాయి. కబ్జాదారులు వారి కీలుబొమ్మను మన రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ వారు విజయవంతం కాలేరని  జెలెన్ స్కీ  ప్రకటించారు.  రష్యాపై  అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలను విధించాయి.

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే