Russia Ukraine Crisis: ర‌ష్యాకు కెనడా షాక్ .. నౌక‌యానంపై ఆంక్షలు

Published : Mar 02, 2022, 03:23 AM IST
Russia Ukraine Crisis: ర‌ష్యాకు కెనడా షాక్  .. నౌక‌యానంపై ఆంక్షలు

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి వ్య‌తిరేకంగా  కెనడా కూడా ర‌ష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా నౌకలు, ఫిషింగ్ బోట్లు కెనడాలోకి ప్రవేశించకుండా నిషేధించింది. కెన‌డా లోని  అంతర్గత జలాలు, ఓడరేవుల నుండి రష్యన్ ఓడ‌లు, ఫిషింగ్ బోట్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ఒట్టావా మంగళవారం ప్రకటించింది.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులను వేగవంతం చేస్తుంది. ఆరో రోజుకు కూడా దాడులు కొన‌సాగించింది. రష్యా సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ర‌ష్యా త‌న‌ దురాక్రమణను వెంటనే నిలిపివేయాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక పశ్చిమ దేశాలు భారీ స్థాయిలో రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఇప్ప‌టికే రష్యా తన తప్పుడు నిర్ణయానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవ‌ల్సి ఉంటుంద‌ని ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చరిస్తున్నాయి. 

ఉక్రెయిన్‌పై దండ‌యాత్ర‌కు దిగిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ త‌గిలేలా బ్రిట‌న్‌, అమెరికా త‌దిత‌ర దేశాలు.. ర‌ష్యా బ్యాంకుల‌ను స్విఫ్ట్ సేవ‌ల నుంచి బ‌హిష్క‌రించాయి. స్విఫ్ట్ విధానాన్ని నిలిపివేయడం ద్వారా చెల్లింపులు చేయాల్సిన సంస్థలు, ఆర్ధిక సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్విఫ్ట్ నుంచి ర‌ష్యాను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల ఆ దేశ క‌రెన్సీ ప‌త‌న‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే ర‌ష్యా క‌రెన్సీ ర‌బుల్ 30 శాతానికి దిగ‌జారింది. ఈ నేప‌థ్యంలో బ్యాంక్ ఆఫ్ ర‌ష్యా  వ‌డ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అయినా..  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌తికార చ‌ర్య‌గా..  ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా బలాగాలు దాడి చేస్తున్నట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ సభ్య అత్యవసర సమావేశంలోనూ ఉక్రెయిన్ లేవనెత్తింది.  
 
తాజాగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి వ్య‌తిరేకంగా  కెనడా కూడా ర‌ష్యాపై ఆంక్షాలు విధించింది. రష్యా నౌకలు, ఫిషింగ్ బోట్లు కెనడాలోకి ప్రవేశించకుండా నిషేధించింది. కెన‌డా లోని  అంతర్గత జలాలు, ఓడరేవుల నుండి రష్యన్ ఓడ‌లు, ఫిషింగ్ బోట్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ఒట్టావా మంగళవారం ప్రకటించింది. బ్రిటన్ కూడా ఇదే విధమైన చర్యను అనుసరిస్తుంద‌ని  రవాణా మంత్రి ఒమర్ అల్గాబ్రా తెలిపారు. మరిన్ని దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల రష్యన్ గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని  అల్గాబ్రా ఒట్టావా అన్నారు.ఇతర దేశాలు కూడా అదే పని చేయాలని, ఆలోచిస్తున్నాయని అతను చెప్పాడు. ఈ నిషేధం వ‌ల్ల రష్యన్ ఓడలు నేరుగా కెనడా నౌకాశ్రయాలకు ప్రయాణించవని అల్గాబ్రా అంగీకరించింది,   

అదే సమయంలో యుద్ధం నుండి పారిపోతున్న వేలాది మందిని ఉక్రెయిన్ పౌరుల‌కు స్వాగతిస్తున్న‌ట్టు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే.. మానవతా సహాయంగా కెనడా $100 మిలియన్ (US$80 మిలియన్లు) ప్రకటించింది.  ఇప్ప‌టికే  యూరోపియన్ అనేక దేశాలు రష్యన్ విమానాలపై ఆంక్షాలు విధించిన విష‌యం తెలిసిందే.. ఈ తాజా నిర్ణ‌యంతో ర‌ష్యా దిగివ‌స్తుందో వేచి చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే