Russia Ukraine Crisis: కీవ్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ మూసివేత‌

Published : Mar 02, 2022, 01:47 AM IST
Russia Ukraine Crisis: కీవ్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ మూసివేత‌

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేశారు. కీవ్ న‌గ‌రంపై ర‌ష్యా సైన్యాలు భీక‌ర దాడులు చేస్తున్న నేప‌థ్యంలో ఆ న‌గ‌రంలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం మూసేయాల‌ని విదేశాంగ‌శాఖ నిర్ణ‌యించింది.    

Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా మధ్య‌ యుద్ధం రోజురోజుకు తీవ్ర‌త‌రమ‌వుతోంది. రష్యా ఆక్రమణదాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. యుద్దాన్ని నిలిపివేయాల‌నే దిశ‌గా ర‌ష్యా- ఉక్రెయిన్ ల మ‌ధ్య సోమ‌వారం ఇరుదేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ, ఇరుదేశాలు  ఏకాభిప్రాయానికి రాక‌పోవ‌డంతో ఆ చ‌ర్చ‌లు విఫ‌ల‌మయ్యాయి. 

ఇప్ప‌టికే ర‌ష్యాను తీరును వ్య‌తిరేకిస్తూ.. ప‌లు దేశాలు ఆంక్షాలు విధించిన విష‌యం తెలిసిందే.  ర‌ష్యా ఆర్థిక వ్యవస్థ ప్ర‌భావం చూసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అలాగే..  ప్రపంచ కప్ నుండి FIFA నిషేధించడం వంటి ప్రపంచ ఒత్తిడిని ధిక్కరిస్తూ..నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే.. ర‌ష్యా మంగళవారం ఉక్రేనియన్ నగరం ఖార్కివ్‌పై రష్యా దాడి చేసింది. 
  
ఇంకా, యూరోపియన్ యూనియన్ కూడా రష్యా పై ఆంక్షాలు విధించింది. ర‌ష్యాను ఆంక్షల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇక, ఉక్రెయిన్ గణాంకాల ప్రకారం.. ర‌ష్యా దండయాత్రలో 14 మంది పిల్లలతో సహా 350 మందికి పైగా పౌరులు మరణించారనీ, ఈ య‌ద్ద వాతావ‌ర‌ణంలో  దాదాపు అర మిలియల‌న్ కంటే ఎక్కువ మంది ప్రజలు దేశం నుండి పారిపోయిన‌ట్టు ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి.
 
కాగా, ఉక్రెయిన్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన దాడుల్లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను అత్యవసరంగా రైళ్లలో లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా విడిచిపెట్టాలని భారతీయుల‌కు  ఎంబసీ కోరింది. ఇదే త‌రుణంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. కీవ్‌లో ప్ర‌స్తుతం భారతీయులెవ‌రూ లేరనీ,   ఎంబ‌సీని భార‌త దౌత్య సిబ్బందిని మ‌రోచోటికి త‌ర‌లించారని విదేశాంగ‌శాఖ  ప్ర‌క‌టించింది.
 
ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  త‌మ దేశంపై ర‌ష్యా దాడుల‌ను ఖండిస్తున్నామ‌ని. దేశ చ‌రిత్రలో మంగ‌ళ‌వారం బ్లాక్‌డే అని అభిప్రాయ ప‌డ్డారు. ఈయూ పార్ల‌మెంట్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కై మాట్లాడుతూ .. త‌మ‌కు ఈయూ దేశాల మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. ర‌ష్యా ఎన్ని దాడులు చేసినా తాము పోరాడుతున్నామ‌ని, యుద్ధానికి భ‌య‌ప‌డ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఈ దాడిలో అమాయ‌కులు, ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నార‌ని జెలెన్‌స్కై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే