నైట్ క్లబ్ లో మద్యం తాగిన యువతి..ఆ తర్వత సడెన్ గా..

Published : Aug 05, 2021, 11:03 AM IST
నైట్ క్లబ్ లో మద్యం తాగిన యువతి..ఆ తర్వత సడెన్ గా..

సారాంశం

18 ఏళ్ల వయసున్న మిల్లీ ట్యాప్లిన్ అనే యువతి నైట్ క్లబ్ లో మద్యం తాగింది. అంతే మూర్చ వచ్చినట్లు పడిపోయి మిల్లీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. 

ఓ యువతి నైట్ క్లబ్ కి వెళ్లింది.  అక్కడ తనకు నచ్చినట్లు మద్యం సేవించింది. ఆ తర్వాత సడెన్ గా ఆమె శరీరమంతా బిగుసుపోయింది. మంచులో గడ్డ గట్టుకుపోతే ఎలా అవుతారో.. ఆమె అలా తయారవ్వడం గమనార్హం.  ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విహారయాత్రకు వచ్చి నైట్ క్లబ్‌లో గుర్తుతెలియని మద్యం తాగిన 18 ఏళ్ల యువతి కండరాలు బిగుసుకుపోయిన వింత ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.18 ఏళ్ల వయసున్న మిల్లీ ట్యాప్లిన్ అనే యువతి నైట్ క్లబ్ లో మద్యం తాగింది. అంతే మూర్చ వచ్చినట్లు పడిపోయి మిల్లీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. 

దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్పందించిన వైద్యులు మిల్లీకి రెండురకాల మందులు ఇచ్చారు. దీంతో ఆమెకు పక్షవాతానికి గురైంది. మిల్లీ ముఖ కండరాలు బిగుసుకుపోయి, చేతులు కదపలేక పోవడంతో ఆసుపత్రి బెడ్ మీద పడుకుంది.

మిల్లీ ట్యాప్లిన్ వేళ్లు ముఖ కవళికలు కదలడం లేదు. మిల్లీ నడవలేని పరిస్థితిలో కూలబడింది. ఈ ఘటన గురించి  మిల్లీ ట్యాప్లిన్ తల్లి కైర్ ఫేస్‌బుక్‌లో ఫొటోలతో షేర్ చేసింది. ‘‘దయచేసి మీరు బయటకు వెళ్లినపుడు జాగ్రత్తగా ఉండండి, అపరిచితులు ఇచ్చిన మద్యం తాగొద్దు’’ అని కైర్ సలహా ఇచ్చింది. నైట్‌క్లబ్‌లు,పార్టీల్లో మహిళలు అపరిచితుల నుండి పానీయాలను ఎప్పుడూ స్వీకరించవద్దు అని కైర్ వివరించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !