రక్షణ మంత్రి లక్ష్యంగా తాలిబన్ల దాడి: తప్పించుకొన్న మంత్రి, 8 మంది మృతి

By narsimha lodeFirst Published Aug 4, 2021, 3:21 PM IST
Highlights


రక్షణశాఖ మంత్రి లక్ష్యంగా తాలిబన్లు కాబూల్ లో మంగళవారం నాడు బాంబుదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం నండి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.

కాబూల్: ఆఫ్ఘన్ రక్షణ మంత్రిని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు బాంబుదాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు మరో 20 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన నుండి మంత్రి ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.కాబూల్‌లో భారీ భద్రత ఉన్న ప్రాంతంలో మంగళవారం నాడు రాత్రి పేలుడు చోటు చేసుకొంది. బాంబు పేలుడు తర్వాత జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టుగా అధికారులు తెలిపారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు. ఈ బాంబుదాడికి తామే బాధ్యులమని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ బలగాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టుగా ఆయన స్పష్టం చేశారు.

రక్షణమంత్రి బిస్మిల్లాఖాన్ మహ్మదీని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఆయన గాయపడలేదని ప్రభుత్వవర్గాలు  ప్రకటించాయి. ఈ దాడి జరిగిన సమయంలో ఆ భవనంలో మంత్రి లేడు. ఆయన కుటుంబసభ్యులను సురక్షితంగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి.కాబూల్‌లోని గ్రీన్ జోన్ అని పిలువబడే షేర్‌పూర్ పరిసరాల్లో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో సీనియర్ అధికారులు నివాసం ఉంటారు.ఈ బాంబుదాడిలో తన సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారని రక్షణశాఖ మంత్రి బుధవారం నాడు ఓ వీడియోను విడుదల చేశారు.


 

click me!