గూగుల్ ఉద్యోగికి 300 శాతం వేతనం పెంపు: ఎందుకో తెలుసా?

By narsimha lodeFirst Published Feb 19, 2024, 7:56 PM IST
Highlights

తమ సంస్థ నుండి మరో సంస్థలోకి ఉద్యోగి వెళ్లకుండా  గూగుల్ సంస్థ 300 శాతం వేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: తమ సంస్థ నుండి  ఇతర సంస్థల్లోకి ఉద్యోగులు వెళ్లకుండా నిరోధించేందుకు  కొన్ని సంస్థలు అన్నిరకాల అస్త్రాలను ప్రయోగిస్తుంటాయి. తమ సంస్థకు పనికొచ్చే ఉద్యోగులను ఇతర సంస్థలకు వెళ్లకుండా కొన్ని సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో వేతనాల పెంపుతో పాటు ఇతర ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే గూగుల్ సంస్థ కూడ ఇదే తరహా ఆఫర్ ను ఓ ఉద్యోగికి ప్రకటించింది. 

also read:తెలంగాణలో గ్రూప్-1 : 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

పెర్‌ప్లెక్సిటీ ఎఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఈ విషయాన్ని  బయటపెట్టారు. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తమ సంస్థలోకి తీసుకొనేందుకు  ఆయన ప్రయత్నించిన సమయంలో  జరిగిన ఘటనను శ్రీనివాస్ బయటపెట్టారు. గూగుల్ నుండి  ఆ ఉద్యోగి బయటకు వెళ్లకుండా ఉండేందుకు గాను  300 శాతం జీతం పెంచాలని  ఆఫర్ ప్రకటించిందని శ్రీనివాస్ చెప్పారు.  పెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను కాపాడేందుకు  ఎంతవరకు వెళ్తున్నాయో  ఈ ఉదంతం తెలుపుతుంది.  బిగ్ టెక్నాలజీ పాడ్ క్యాస్ట్  ఇటీవల ఎపిసోడ్  తో  ఈ విషయం వెలుగు చూసింది. ఈ పాడ్ క్యాస్ట్ లో శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

also read:ఢిల్లీకి పవన్ కళ్యాణ్: ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన?

గణనీయమైన జీతం ఆఫర్ ను పొందిన  ఉద్యోగి ఎఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేదని కూడ శ్రీనివాస్ వివరించారు. అయితే ఆ ఉద్యోగి గూగుల్ నుండి బయటకు వెళ్లకుండా 300 శాతం వేతనం పెంపు ఆఫర్ ను ప్రకటించారని  శ్రీనివాస్ చెప్పారు.


గూగుల్ లో ఇటీవల కాలంలో ఉద్యోగాల కోత పెరిగింది.  అయితే ఈ సమయంలో అసాధారణ జీతాల పెంపు వెలుగు చూసింది.  గూగుల్ లో  ఉద్యోగులకు  తొలగింపు వార్నింగ్ ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ నుండి వస్తూనే ఉన్నాయి. గూగుల్ ఉద్యోగులకు  ఉద్దేశించిన అంతర్గత మెమోలో  సుందర్ పిచాయ్ కీలక అంశాలను ప్రస్తావించారు. కఠినమైన ఎంపికల అవసరాన్ని పిచాయ్  ఆ మెమోలో  నొక్కి చెప్పారు.సంస్థ యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాలను  పిచాయ్  మెమోలో పేర్కొన్నారు. శ్రామిక శక్తి తగ్గింపుతో సహా కఠిన నిర్ణయాలు కూడ అవసరమని ఆ మెమోలో  పిచాయ్ నొక్కి చెప్పారు.

also read:గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

ఈ ఏడాది జనవరి  10వ తేదీ నుండి  గూగుల్ వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. పిచాయ్ గతంలో చేసిన ప్రకటనలను పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా  12 వేల మంది ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్టుగా  సూచించాయి.అంటే ఇది గూగుల్ ఉద్యోగుల్లో ఆరు శాతం .

ఉద్యోగులకు మునుపటి కమ్యూనికేషన్ లో  గూగుల్ సంస్థలో  12 వేల మంది ఉద్యోగుల తొలగించాలని సంస్థ ఉద్యోగులకు  వివరించారు. యూఎస్ లోని ఉద్యోగులు తక్షణ నోటిఫికేషన్లను అందుకున్నప్పటికి స్థానిక చట్టాలు, నిబంధనల కారణంగా ఇతర దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టొచ్చు.గూగుల్ సంస్థ నుండి ఓ ఉద్యోగిని వేరే సంస్థలోకి వెళ్లకుండా  300 శాతం  వేతనం పెంపు ఆఫర్ ను ఇచ్చింది. ఈ విషయాన్ని పెర్‌ప్లెక్సిటీ ఎఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ప్రకటించారు.


 

click me!