
లండన్ :తనను భారత్ కు అప్పగించవద్దని నీరవ్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ ను యూకే కోర్టు కొట్టివేసింది.దీంతో ఆయనను ఇండియాకుఅప్పగించేందుకు మార్గం సుగమమైంది.ప్రభుత్వబ్యాంకులను రూ.11వేల కోట్లకు పైగా మోసం చేసి భారత్ నుండి పారిపోయాడు గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో విచారణను ఎదుర్కొనేందుకు భారత్ కు తిరిగి పంపడాన్ని వ్యతిరేకిస్తూ యూకే హైకోర్టులో అప్పీల్ చేశారు.ఈ అప్పీల్ ను లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్ స్మిత్ జస్టిస్ రాబర్ట్ జేలు విచారించారు.నీరవ్ మోడీ అప్పీల్ ను తిరస్కరిస్తూ ఇవాళ తీర్పును వెల్లడించారు.
నీరవ్ మోడీని లండన్ నుండి ముంబైలోని ఆర్ధర్ జైలుకు తీసుకురావడానికి మరికొంత సమయంమ పట్టనుంది. ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్న అతని మేనమామ మొహల్ చోక్సీపై కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారని ఆరోపణలున్నాయి.ఇవాళ యూకే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ బ్రిటన్ సుప్రీంకోర్టును 14 రోజుల్లో ఆశ్రయించే అవకాశం ఉంది.అయితే ఈ కేసులో ప్రజా ప్రాముఖ్యత ఉందని హైకోర్టు అంగీకరిస్తేనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంది.యూకే హైకోర్టులో నీరవ్ మోడీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన ఏం చేయబొతున్నారనే విషయమై ఆయన తరపు న్యాయవాదలుు ఏమీ చెప్పలేదు.2019 మార్చిలో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను లండన్ జైలులోనే ఉంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీతో పాటు చోక్సీలను భారత్ కు రప్పించేందుకుదర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీరిద్దరితోపాటు మరో 20 మందిపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది.