మోదీ-సునాక్‌ల భేటీ.. కొన్ని గంటల్లోనే భారత పౌరులకు బ్రిటన్ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?

Published : Nov 16, 2022, 10:27 AM ISTUpdated : Nov 16, 2022, 10:29 AM IST
మోదీ-సునాక్‌ల భేటీ.. కొన్ని గంటల్లోనే భారత పౌరులకు బ్రిటన్ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?

సారాంశం

ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. యూకే వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది.

ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. యూకే వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు అందించే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు యూకే ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఇటువంటి పథకం నుంచి ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత దేశమేనని పేర్కొంది.

యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద.. 18-30 ఏళ్ల వయస్సు గల డిగ్రీ పొందిన భారతీయ పౌరులకు 3,000 వీసాలను అందించనున్నట్టుగా  యూకే ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.  ‘‘ఈ రోజు యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ధృవీకరించబడింది,.18-30 ఏళ్ల డిగ్రీ-విద్యావంతులైన భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి, పని చేయడానికి యూకేకి రావడానికి 3,000 వీసాలను అందిస్తుంది’’ అని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం  ట్వీట్ చేసింది. 

 

 

బ్రిటన్ ప్రధాని సునాక్, భారత ప్రధాని మోదీ జీ20 సదస్సులో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం యూకే ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.  యూకే ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన ప్రకారం.. యూకే ఇతర దేశాల కంటే భారతదేశంతో ఎక్కువ సంబంధాలను కలిగి ఉంది. యూకేలోని అంతర్జాతీయ విద్యార్థులలో నాలుగింట ఒక వంతు భారతదేశానికి చెందినవారు ఉన్నారు. దేశంలో భారతీయ పెట్టుబడి దాదాపు 95,000 ఉద్యోగాలకు మద్దతు ఇస్తుంది.

యూకే హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2022 జూన్తో ముగిసిన సంవత్సరంలో దాదాపు 118,000 మంది భారతీయ విద్యార్థులు యూకే స్టూడెంట్ వీసా పొందారు. ఇది గతేడాదితో పోలిస్తే 89 శాతం పెరిగింది. 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి