
న్యూఢిల్లీ: కెన్యా అధ్యక్షుడు విలియం రూతోకు డిజిటల్ క్యాంపెయిన్ చేసిన ఇద్దరు భారతీయులు జుల్ఫీకర్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్‌లను నిషేధత సంస్థ సభ్యులు హతమార్చినట్టు ఓ మీడియా కథనం పేర్కొంది. వారు ఈ ఏడాది జులైలో కెన్యాలో కనిపించకుండా పోయారు. జుల్ఫీకర్ అహ్మద్ ఖాన్ చివరి సారిగా బాలాజీ టెలీఫిలిమ్స్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. అంతకు ముందు హూక్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఎరోస్ నౌ సంస్థకు చీఫ్ రెవెన్యూ అధికారిగానూ, బిజినెస్ హెడ్‌గానూ పని చేశారు.
జుల్ఫీకర్, మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్‌లు రూతో క్యాంపెయిన్ సక్సెస్ కావడంతో కీలక పాత్ర పోషించారని రూతో అద్యక్ష క్యాంపెయిన్‌ను ముందుండి చేపట్టిన ఇటుంబి వివరించారు.
భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకారం, కెన్యాలో వీరిద్దరు జులైలో కనిపించకుండా పోయారు. ఆ తర్వాతే ఓ పోలీసు ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత కెన్యా కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఫైల్ అయింది.
Also Read: కెన్యా మాజీ ప్రధాని కూతురికి ఆయుర్వేదంతో కంటిచూపు.. ‘ఆయుర్వేదాన్ని మా దేశంలో ప్రారంభిస్తాం’
చట్టవ్యతిరేక హత్యలకు పాల్పడే గ్రూపుగా స్పెషల్ సర్వీస్ యూనిట్‌ను పేర్కొంటారు. ఈ ఇద్దరు భారతీయుల మిస్సింగ్ వెనుక ఈ గ్రూపు ప్రమేయమే ఉన్నదని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రెసిడెంట్ రూతో సీరియస్‌గా తీసుకున్నారు. వీరిద్దరి అదృశ్యం వెనుక ఈ స్పెషల్ సర్వీస్ యూనిట్ హస్తం ఉన్నట్టు తెలియగానే ప్రెసిడెంట్ ఆ గ్రూపును నిషేధించారు.