మహిళలు పిజ్జా తినవద్దు.. పురుషులు వారికి టీ అందించవద్దు.. ఇరాన్ సెన్సార్షిప్ నిబంధనలే వేరయా..!

By telugu teamFirst Published Oct 11, 2021, 3:38 PM IST
Highlights

మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు పిజ్జా లేదా శాండ్‌విచ్ తింటూ స్క్రీన్‌పై కనిపించరాదని సెన్సార్షిప్ నిబంధనలు వెల్లడించింది. పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయరాదని తెలిపింది. మహిళలు లెదర్ గ్లౌవ్స్ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: మహిళలు ఇంటి గడప దాటవద్దు. అత్యవసరంగా బయటికివెళ్లాల్సి వస్తే పురుషుడి తోడు తప్పనిసరి. స్టేడియాల్లోకి వెళ్లవద్దు వంటి నిబంధనలు ఇప్పటి దాకా మనం ఆఫ్ఘనిస్తాన్‌లో taliban విధించగా చూశాం. అదే తీరులో Iran కూడా womenపై ఆంక్షలు విధిస్తున్నది. తాలిబాన్ల స్థాయిలో కాకున్నా ఇరాన్ ప్రభుత్వం restrictions విధిస్తున్నది.

సాధారణంగా కమర్షియల్ యాడ్స్‌లో మహిళలు pizza తినడం, కూల్ డ్రింక్స్ తాగడం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ చర్యలు ఇరాన్ ప్రభుత్వానికి నచ్చడం లేవు. అందుకే వాటిపై ఆంక్షలు విధిస్తున్నది. మహిళలు స్క్రీన్‌పై పిజ్జాలు, శాండ్‌విచ్‌లు తినడాన్ని నిషేధించింది. అంతేకాదు, పనిచేసే చోట్ల men.. మహిళలకు టీ సర్వ్ చేయడాన్నీ అడ్డుకుంది. అలాగే, మహిళలు ఎరుపు రంగులోని డ్రింక్స్ ఏవీ తాగరాదని స్పష్టం చేసింది. లెదర్ గ్లౌవ్స్‌ కూడా మహిళలు ధరించి టీవీ స్క్రీన్‌లపై కనిపించరాదని తెలిపింది.

ఈ censorship నిబంధనలను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌క్యాస్టింగ్(ఐఆర్ఐబీ) అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

‘నన్ను ఆఫీసునుంచి వెళ్లగొట్టారు.. మా ప్రాణాలకు ముప్పు ఉంది...’ ఆఫ్ఘన్ మహిళా న్యూస్ యాంకర్ వీడియో వైరల్...

ఇటీవలే ఇరానియన్ టాక్ షో పిష్‌గూ కార్యక్రమంలో నటి ఎల్నాజ్ హబీబీ ముఖాన్ని చూపించలేదు. ఆ షో మొత్తం కేవలం ఆమె వాయిస్ మాత్రమే వినిపించేలా ప్రసారం చేశారు. ముఖం చూపెట్టకుండా, ముందుగా అసలు మాట్లాడేదెవరో వ్యాఖ్యలు చెప్పకుండా కార్యక్రమంలో పాల్గొన్నదెవరో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని కొందరు నిరసిస్తున్నారు. ప్రముఖ నటుడు అమిన్ రోఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

click me!