దారుణం: ఇద్దరు మహిళా జడ్జిల కాల్చివేత

Published : Jan 18, 2021, 08:55 PM IST
దారుణం: ఇద్దరు మహిళా జడ్జిల కాల్చివేత

సారాంశం

ఆఫ్గనిస్తాన్ లో  ఇద్దరు మహిళా జడ్జిలను ఆదివారం నాడు కాల్చి చంపారు.  కారులో ప్రయాణీస్తున్న జడ్జిలపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

కాబూల్: ఆఫ్గనిస్తాన్ లో  ఇద్దరు మహిళా జడ్జిలను ఆదివారం నాడు కాల్చి చంపారు.  కారులో ప్రయాణీస్తున్న జడ్జిలపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

కాబూల్‌ హైకోర్టులో వీరిద్దరూ పనిచేస్తున్నారని గుర్తించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫహిమ్ స్పందించారు. వీరిద్దరూ హైకోర్టులో పనిచేస్తున్నారని ఆయన ధృవీకరించారు.ఈ దాడికి ఎవరూ తాము బాధులని ప్రకటించలేదు. ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ సాయుధ బృందం ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ బృందం బాధ్యత వహించదన్నారు.

తాలిబన్ , ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు సాగుతున్నాయి. అయినా కూడ దేశంలో హింస పెరుగుతుంది. కాబూల్ లో ఉన్నతస్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు, హత్యలు సాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ దళాలను 2,500కి తగ్గించినట్టుగా పెంటగాన్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి చోటు చేసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..