
రష్యాకు చెందిన ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చిన అనతరం మళ్లీ అతడి కొడుకునే పెళ్లి చేసుకుంది. తాజాగా వీరిద్దరికీ ఓ పండంటి బిడ్డ పుట్టింది. ఇప్పుడీ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 4 లక్షల మంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలబ్రెటీగా మారిన మెరీనా బల్మషేవ(35) గతేడాది జులైలో తన సవతి కొడుకు వ్లాదిమిర్ వోయా (21)ను పెళ్లి చేసుకున్నసంఘటన గతేడాది వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల గర్భవతి అయిన మెరీనా సోమవారం పండంటి బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. కాగా మెరీనా ప్రస్తుత భర్త వ్లాదిమిర్ వోయా తండ్రి అలెక్స్ అరేను పెళ్లి చేసుకుని అతనితో పదేళ్లు కలిసి ఉంది.
అంతేగాక వీరు ఐదుగురు పిల్లలను కూడా దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయాక అయిదుగురి దత్తత పిల్లల బాధ్యతను తండ్రైన అలెక్స్‌కే కోర్టు అప్పగించింది.
అనంతరం మెరీనా అలెక్స్ 21 ఏళ్ల కొడుకు వ్లాదిమిర్ వోయాతో ప్రేమలో పడింది. ఇక వ్లాదిమియా కూడా తన సవతి తల్లిపై మనసు పారేసుకోవడంతో వీరిద్దరూ గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిచింది.