ట్విట్టర్ షాక్ : ట్రంప్ ఖాతా క్లోజ్ చేసింది మనమ్మాయే.. !!

By AN TeluguFirst Published Jan 11, 2021, 1:28 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాతో పాటు, టీమ్ ట్రంప్ అనే ఖాతానూ ట్విట్టర్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఖాతా కావటంతో నిషేధించలేకపోయినప్పటికీ దాంట్లో చాలా వివాదాస్పద ట్వీట్లను తొలగించింది. ఈ చర్యల వెనుక ఆ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దె ఉన్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాతో పాటు, టీమ్ ట్రంప్ అనే ఖాతానూ ట్విట్టర్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఖాతా కావటంతో నిషేధించలేకపోయినప్పటికీ దాంట్లో చాలా వివాదాస్పద ట్వీట్లను తొలగించింది. ఈ చర్యల వెనుక ఆ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దె ఉన్నారు. 

మరిన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించేందుకు ట్విటర్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను పూర్తిగా తొలగించింది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మీరిక్కడ చదవచ్చు అంటూ ఆమె ఈ సందర్భంగా ట్విటర్ లో ప్రకటించారు. 

విజయ గద్దె హైదరాబాద్ లోనే పుట్టారు. విజయ చిన్న పిల్లగా ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లింది. టెక్సాస్, న్యూ జెర్సీల్లో ఆమె బాల్యం గడిచింది. కార్నెల్ యూనివర్సిటీ నుంచి లాలో డిగ్రీ, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి డాక్టరేటును పొందారు. 

ట్విటర్ కంటే ముందు జూనిపర్ నెట్ వర్క్స్, విల్సన్ సోన్సినీ గుడ్ రీచ్ అండ్ రోసాటీ సంస్థలకు న్యాయసేవలందించారు. కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న విజయ ప్రస్తుతం ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.  350 మంది సిబ్బంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగాన్ని ఆమె లీడ్ చేస్తుంటారు.

ఆమె స్టార్టప్ లకు చేయూతనిస్తున్నారు. మహిళలకు సమాన వేతనాల సాధన కోసం కృషి చేసే యాంజెల్స్ అనే సమిష్టి పెట్టుబడుల సంస్థ సహ-వ్యవస్థాపకురాలు కూడా. దశాబ్ద కాలంగా ట్విటర్ తీసుకున్న చాలా కీలక నిర్ణయాల వెనుక విజయ ప్రభావం ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను విక్రయించకూడదని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీని ఒప్పిండంలో విజయపాత్రే కీలకం. 

గతేడాది ట్రంప్ తో జరిపిన చర్చల్లో 2018లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దలైలామా సందర్శన సమయంలో కూడా ఆమె ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ వెన్నంటే ఉండటం గమనార్హం.

ఈమెను అమెరికా పత్రికలు అత్యంత శక్తివంతమైన మీడియా ఎగ్జిక్యూటివ్ గా అభివర్ణిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుుతన్న ట్విటర్ పరపతికి అనుగుణంగా ఆమె దార్శనికత ఉంటుంది. 

click me!