జపాన్ లో మరో కొత్తరకం కరోనా.. !! బ్రెజిల్ ప్రయాణికుల్లో..

By AN TeluguFirst Published Jan 11, 2021, 10:43 AM IST
Highlights

వ్యాక్సిన్ ల రాకతో జీవితం మళ్లీ మొదటిలాగా తయారవుతుందని ప్రపంచదేశాలు సంతోషపడుతున్న తరుణంలో కొత్త కొత్త కరోనా రకాలు బెంబేలెత్తిస్తున్నాయి.  ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో జన్యుమార్పిడి జరిగిన కరోనా వైరస్ లను గుర్తించారు. తాజాగా జపాన్ లో వీటికి భిన్నమైన మరో వైరస్ ను కనిపెట్టారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు జపాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు జపాన్ ఈ విషయాన్ని తెలియజేసింది. దీని మీద పూర్తిస్థాయిలో జన్యు విశ్లేషణ జరపాలని కోరింది. అలాగే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయో కూడా తెలపాలని కోరింది. వైరస్ గుర్తించిన వ్యక్తుల్లో మొదట ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు అన్నారు.

కానీ, టైం గడిచిన కొద్దీ శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ వ్యక్తిని హాస్పిటల్ లో చేర్చారు. ఇతనికి టెస్టులు చేయగా కొత్తరకం అని నిర్థారణ అయ్యింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్ల కంటే ఇది భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక మరో వ్యక్తిలో జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలున్నాయి. 

జపాన్ లో ఇప్పటి వరకు 30 మందిలో బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్లను గుర్తించారు. కొత్తరకం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విదించారు. టోక్యో నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక ఆ దేశంలో ఇప్పటి వరకు 2,80,000 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 4వేల మంది మరణించారు. 

click me!