అరుదుల్లోకెల్లా అరుదు.. వారిద్దరూ ట్విన్స్.. కానీ, వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు..!

By Mahesh KFirst Published Jan 3, 2022, 5:35 PM IST
Highlights

కవలలు అంటే ఒకే కాన్పులలో ఒకేసారి జన్మిస్తారు. మహా అయితే.. కొన్ని నిమిషాల తేడాతో జన్మిస్తారు. కానీ, అమెరికాలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియా దంపతులకు కవలలు 15 నిమిషాల తేడాతో జన్మించారు. కానీ, వారి బర్త్ డేలు ఏకంగా వేర్వేరు సంవత్సరాల్లో ఉన్నాయి. ఒకరు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.45 గంటలకు జన్మించగా.. మరొకరు 15 నిమిషాల తర్వాత జనవరి 1వ తేదీన జన్మించారు.
 

న్యూఢిల్లీ: దంపతులకు ట్విన్స్(Twins) జన్మించడం అరుదు. ట్విన్స్ అంటే.. ఇద్దరు పిల్లలు ఒకే కాన్పు(Delivery)లో జన్మిస్తారు. మహా అయితే.. కొన్ని నిమిషాల వ్యవధి(Minutes Apart) తేడాతో జన్మిస్తారు. అమెరికా(America)లోని ఓ జంటకు కవలలు జన్మించారు. కానీ, వారు వేర్వేరు నెలల్లోనే కాదు.. ఏకంగా వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు. ఈ మిస్టరీ ఏమిటో అర్థం కావడం లేదా.. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి వారిద్దరూ జన్మించారు. 31వ తేదీ రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఓ చిన్నారి జన్మిస్తే.. 15 నిమిషాల తర్వాత అంటే.. అర్ధరాత్రి దాటి జనవరి 1వ తేదీ తొలి నిమిషంలో జన్మించింది. దీంతో వీరిద్దరూ ఒకే కాన్పులో 15 నిమిషాల తేడాతో జన్మించినా.. వేర్వేరు సంవత్సరాల్లో జన్మించినట్టు అయింది. ఈ ఘటన అరుదుల్లోకెల్లా అరుదు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు 20 లక్షల్లో ఒకటి జరుగుతుందని వివరిస్తున్నారు.

ఫాతిమా మాడ్రిగల్, రాబర్ట్ ట్రుజిలో దంపతులు. వారు అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా(America State California) వాసులు. ఫాతిమా మాడ్రిగల్ 2021 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.45 గంటలకు కొడుకు ఆల్‌ఫ్రెడోకు జన్మనిచ్చారు. కాగా, 15 నిమిషాల తర్వాత అంటే.. 2022 జనవరి 1వ తేదీ ప్రవేశించిన తొలి నిమిషంలోనే కూతురు అయిలన్‌కు జన్మించారు. ‘నాకు ఇద్దరు ట్విన్స్ పుట్టడం సంతోషంగా ఉన్నది. అందులోనూ వారిద్దరికీ వేర్వేరు బర్త్‌డేలు ఉండటం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాయి. నా కూతురు అర్ధరాత్రి లోకంలో అడుగుపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది’ అని కూతురు మాడ్రిగల్ అన్నారు.

Also Read: హైదరాబాద్ లో అరుదైన ప్రసవం... ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

ట్విన్స్ జననంపై నాటివిడాడ మెడికల్ సెంటర్ హాస్పిటల్ ట్వీట్ చేసింది. ఈ ఏరియాలో తొలి బాబును నాటివిడాడ్ హాస్పిటల్ అర్ధరాత్రి అయిలన్ యొలాండా ట్రుజిలోను ఆహ్వానించింది అని పేర్కొంది. కాగా, ఆమె కంటే ముందు ఆల్‌ఫ్రెడో ఆంటోనియో ట్రుజిలో 15 నిమిషాలు ముందుగా అంటే శుక్రవారం రాత్రి 11.45 గంటలకు జన్మించిందని వివరించింది. ఇద్దరు ట్విన్స్ అయినప్పటికీ 15 నిమిషాల తేడాతో జన్మించారని, వారు పుట్టిన సమయం వేర్వేరు తేదీల్లో ఉన్నాయని, అదీ సంవత్సరం మారే డిసెంబర్ 31వ తేదీ కావడంతో.. వీరి జన్మదినాలు వేర్వేరు సంవత్సరాల్లో ఉన్నాయని తెలిపింది. ఫాతిమా మాడ్రిగల్, రాబర్ట్ ట్రుజిలో దంపతులకు ఇది వరకే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు.

Also Read: రెండో పెళ్లి చేసుకోవడానికి కవలలమని నమ్మించి..

అమెరికాలో ప్రతి ఏడాది 1.20 లక్షల ట్విన్స్ జన్మిస్తున్నారు. కానీ, వేర్వేరు తేదీల్లో పుట్టే ట్విన్స్ చాలా అరుదు. ప్రతి 20 లక్షల్లో ఒకసారి ఇలా వేర్వేరు తేదీల్లో కవలలు జన్మిస్తారని హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 2019న ఇలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. డాన్ గిలియమ్ 2019 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.37 గంటలకు ఒక శిశువుకు జన్మనిచ్చింది. రెండో శిశువుకు 2020 జనవరి 1వ తేదీ 12.07 గంటలకు జన్మనిచ్చింది. ఇండియానాలో కార్మెల్‌లోని విన్సెంట్ హాస్పిటల్‌లో వీరు జన్మించారు.

click me!