
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లో గతేడాది ఆగస్టులో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నది మొదలు తాలిబాన్ల(Taliban) ఆకృత్యాలకు హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మత ఛాందసం తీవ్రంగా కనిపించింది. మహిళల హక్కులను కాలరాయడం.. మగవారి సహాయం లేకుండా గడప బయట అడుగు పెట్టవద్దని.. ఇంకా చాలా రకాల అభ్యంతరకర నిబంధనలు అమలు చేస్తున్నారు. మహిళలపైనా తీవ్రంగా విమర్శలు చేశారు. తాజాగా, ఇస్లాం మతాన్ని పేర్కొంటూ వారు మంచి పనే చేశారు. మూడు వేల లీటర్ల లిక్కర్(Liquor)ను కెనాల్‌లో పోసేశారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సారా దుకాణాలు, లిక్కర్ అమ్మకాలపై విరుచుకుపడుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్(జీడీఐ) ఓ వీడియోను పోస్టు చేసింది. జీడీఐ ఆకస్మికంగా చేపట్టిన తనిఖీల్లో చాలా చోట్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లిక్కర్ పెద్ద పెద్ద డ్రమ్‌లలో ఉంచారు. తాజాగా, సీజ్ చేసిన ఆ లిక్కర్‌లను దేశ రాజధాని కాబూల్‌లోని ఓ కెనాల్‌లో పడేశారు. డ్రమ్‌లన్నీ వరుసగా వంపి కెనాల్‌లో ఆ లిక్కర్ పోసేస్తున్న వీడియోను జీడీఐ ట్వీట్ చేసింది.
Also Read: శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’
ముస్లింల ఆల్కహాల్ తయారు చేయడానికి కచ్చితంగా దూరంగా ఉండాలని ఆ ఫుటేజీలో ఓ మత పెద్ద అంటున్నాడు. ఆల్కహాల్ డెలివరీని కూడా చేపట్టవద్దని ఆదేశించారు. జీడీఐ ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలోనూ మద్య పానం అమ్మడం, సేవించడంపై నిషేధం ఉన్నది. కానీ, ఇంత నిక్కచ్చిగా అమలు చేయలేదు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్కహాల్ అమ్మకాలు, సేవించడంపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ఆగస్టు 15లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్లు.. మద్యపానం అమ్మకాలు, సేవించడంపై దాడులు చేయడంతోపాటు, మద్యపానానికి బానిసలుగా మారిన వారినీ టార్గెట్ చేసుకున్నారు. ఈ రెయిడ్లు దేశంలో భారీగా పెరిగిపోయాయి.
ఈ ఏడాది ఆగస్టులో Afghanistan చరిత్రలో కీలక పరిణామాలు జరిగాయి. ప్రజలు ఎన్నుకున్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్లు(Taliban) హస్తగతం చేసుకన్నారు. కాబూల్‌ను సీజ్ చేసిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఆగస్టులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత విదేశీ సాయం నిలిచిపోయింది. ఐఎంఎఫ్ సహా పాశ్చాత్య, ఇతర దేశాలు విదేశీ సాయాన్ని నిలిపేశాయి. అప్పటికే ఆర్థికంగా(Economy) పతన దశలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది దారుణంగా దెబ్బ తీసింది. విదేశీ సాయాన్ని పునరుద్ధరించుకోవడానికి తాలిబన్లు ఛాందస వాదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, అవి సఫలం కాలేదు. స్వయంగా పాకిస్తాన్ కూడా తాలిబన్లకు మద్దతుగా పలు అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు.
Also Read: ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయ హస్తం అందించిన భారత్.. 5 లక్షల టీకాల సరఫరా.. త్వరలో మరో 5 లక్షల వ్యాక్సిన్లు
తాలిబన్లు అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకులు చాలా వరకు క్లోజ్ అయ్యాయి. నిత్యావసర సరుకులు భగ్గుమన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలూ కొన్ని నెలలపాటు అందలేదు. వేతనాల కోసం రోడ్డెక్కి ధర్నాలూ చేశారు. ఇలాంటి సందర్భంలో రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి విదేశీ సాయం లేకుండా బడ్జెట్(Budget)ను సిద్ధం చేస్తున్నది. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్టు తాలిబన్లు వెల్లడించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్ఘానిస్తాన్ కరెన్సీ అఫ్ఘాని దారుణంగా పతనం అయింది. తాలిబన్లు రాక పూర్వం ఒక అమెరికన్ డాలర్ విలువ 80 అఫ్ఘానీలు కాగా, ఆ విలువ 130 అఫ్ఘానీలకు పడిపోయింది. తాజాగా, శుక్రవారం ఇది 100 అఫ్ఘానీలకు చేరింది.