లోయలో పడిన బస్సు..20మంది మృతి

Published : Mar 10, 2020, 08:32 AM IST
లోయలో పడిన బస్సు..20మంది మృతి

సారాంశం

బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

బస్సు లోయలో పడి 20మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన  పాకిస్థాన్ లో సోమవారం చోటుచేసుకుంది. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం... రావల్పిండి నుంచి స్కర్దు ప్రాంతానికి ఓ బస్సు  25మంది ప్రయాణికులతో బయలుదేరింది.

Also Read రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి...

ఈ క్రమంలో బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఇప్పటి వరకు 8మంది మృతదేహాలను వెలికి తీశారు.  సైనిక హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?
సరిగ్గా వందేళ్ల సీన్ రిపీట్... 1926 పరిస్థితులే 2026 లో కూడా.. ఇక అమెరికా పరిస్థితి అంతేనా..?