Tsunami: తూర్పు తైమూర్‌లో భూకంపం.. హిందూ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు

By Mahesh RajamoniFirst Published May 27, 2022, 4:46 PM IST
Highlights

Earthquake: హిందూ మహాసముద్రంలో సునామీ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. అమెరికాకు చెందిన USGS సంస్థ ఈ సునామీని జారీ చేసింది. తూర్పు తైమూర్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ హెచ్చరిక జారీ చేశారు. 
 

Indian Ocean: ఆగ్నేయాసియా దేశమైన తూర్పు తైమూర్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం లోస్పాలోస్ అనే ప్రదేశానికి ఈశాన్యంగా 38 కి.మీ. దూరంలో  భూకంపం కేంద్రం లోతు 49 కిలోమీటర్ల వ‌ద్ద కేంద్రీకృత‌మైంద‌ని అధికారిక రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ భూకంపం కారణంగా 'హిందూ మహాసముద్రంలో సునామీ' వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన  యూఎస్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ యూఎస్‌జీఎస్ సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో హిందూ మ‌హాస‌ముద్ర తీర దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. 

తూర్పు తైమూరు భూకంపం త‌ర్వాత అమెరికాకు చెందిన USGS హిందూ మహాస‌ముద్రంలో సునామీ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేసింది. యూఎస్‌జీఎస్ తో పాటు IOTWMS కూడా సునామీ హెచ్చరికను జారీ చేసింది. తూర్పు తైమూర్ రాజధానిలో భూకంపం వచ్చింది. అది చాలా వేగంగా వచ్చిందని మరియు త్వరగా అయిపోయిందని అక్క‌డి ప్రాంతాల వారు చెప్పారు. దీని తరువాత ప్రజలు తమ పనిని పూర్తి చేయడానికి సాధారణంగా బయటకు వెళ్లారు. భూకంపం ధాటికి పొరుగున ఉన్న బొలీవియా రాజధాని లా పాజ్‌లోని కొన్ని భవనాలు మరియు పెరూ నగరాలైన అరెక్విపా, టక్నా మరియు కుస్కోలలో కొన్ని భవనాలు కంపించాయి.

Notable quake, preliminary info: M 6.2 - 38 km NE of Lospalos, Timor Leste https://t.co/TkBhEiUpGz

— USGS Earthquakes (@USGS_Quakes)

రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రదేశం మొత్తం భూమిపై మాత్రమే ఉంది. తూర్పు తైమూర్ దీని పరిధిలోకి వస్తుంది. అంటే, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత కార్యకలాపాలు ఇక్కడ అత్యధికంగా ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర సుమత్రాలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఈ భూకంపాల వల్ల అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. లేదా అగ్నిపర్వతం పేలడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు సునామీలు కూడా వస్తాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  

 

The Indian Ocean Tsunami Warning and Mitigation System (IOTWMS) issued a tsunami warning for the region. It said that the quake "may be capable of generating a tsunami affecting the Indian Ocean region".

— Your Views Your News (@urviewsurnews)

ఈ ప్రాంతంలో 2004లో అత్యంత భయంకరమైన భూకంపం సంభవించింది.  2004లో సుమత్రా తీరాన్ని తాకిన ప్రమాదకరమైన 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ఊహ‌కంద‌ని విధంగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని క‌లిగించి చ‌రిత్ర‌లో నిలిచిపోయే విప‌త్తుగా మారింది. అప్పుడు సంభ‌వించిన ఈ సునామీ కార‌ణంగా ఇండోనేషియాలో 1.70 లక్షల మందితో పాటు తైమూర్‌లో మొత్తం 2.20 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం, తూర్పు తైమూర్ జనాభా దాదాపు 1.3 మిలియన్లు. ఇది ఆగ్నేయాసియాలో అతి పిన్న ఏజ్ దేశం. ఇది ఇటీవల ఇండోనేషియా నుండి స్వాతంత్య్రం పొందిన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 
 

click me!