ట్రంప్ కు 130 డాలర్లతో బర్గర్ కొనిచ్చా.. బాకీ తీర్చలేదు, ఉద్యోగం నుంచి తీసేశాడు..

By AN TeluguFirst Published Apr 3, 2021, 11:41 AM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 2008లో 130 డాలర్లతో బర్గర్ కొనిచ్చానని, ఇప్పటికీ తన బాకీ తీర్చలేదని ఆయన మాజీ బాడీగార్డ్ కెవిన్ మెకీ ఆరోపించారు. ట్రంప్ తన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో షాక్ అయ్యానని కెవిన్ తెలిపాడు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 2008లో 130 డాలర్లతో బర్గర్ కొనిచ్చానని, ఇప్పటికీ తన బాకీ తీర్చలేదని ఆయన మాజీ బాడీగార్డ్ కెవిన్ మెకీ ఆరోపించారు. ట్రంప్ తన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో షాక్ అయ్యానని కెవిన్ తెలిపాడు.

స్కాట్లాండ్‌లోని అబర్దీన్ విమానాశ్రయంలో డొనాల్డ్ ట్రంప్ కు తాను మెక్డొనాల్డ్ బర్గర్ కొనిచ్చినట్టు కెవిన్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ట్రంపు వద్ద యూకే కరెన్సీ లేకపోవడంతో తన వద్ద $130 అప్పుగా తీసుకుని బర్గర్స్ కొనుగోలు చేశాడని తెలిపాడు. 

బాకీ తీసుకున్న 130 డాలర్లతో తనతో పాటుగా ఉన్న వారందరికీ ట్రంప్ బర్గర్ కొనిచ్చారని కెవిన్ చెప్పుకొచ్చాడు. మూడు, నాలుగేళ్లు గడిచిపోయినా ట్రంపు తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, తనను 2012లో ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తో కెవిన్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇప్పటికీ ట్రంప్ నాకు బాకీ ఉన్నారు. అప్పు తీసుకున్నప్పుడు త్వరగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. కానీ ఏళ్లు గడిచిన ఇవ్వలేదు అని కెవిన్ అన్నాడు. మొదట ట్రంప్ వద్ద బాడీగార్డ్ గా చేరినప్పుడు ఆయన డీసెంట్ అని అనుకున్నానని, అందుకే తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారని ఆశించానన్నాడు.  కానీ, అది జరగలేదని కెవిన్ వాపోయాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మనిషి మీ వద్ద అప్పు తీసుకుని, సమయానికి అది తిరిగి ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని ఈ సందర్భంగా కెవిన్ మెకీ చమత్కరించాడు.
 

click me!