యూఎస్ కాపిటల్ వద్ద మరోసారి కలకలం, దూసుకొచ్చిన కారు, అధికారి మృతి

By telugu news teamFirst Published Apr 3, 2021, 9:38 AM IST
Highlights

గాయపడిన ఓ పోలీస్‌తో పాటు నిందితుడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

అమెరికాలోని కాపిటల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ వచ్చి... పోలీసు అధికారిని ఢీ కొట్టాడు. ఈ క్రమంలో.. ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కాపిటల్ భవనం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్లి మరీ.. పోలీసులపైకి ఆ కారు దూసుకు రావడం గమనార్హం.

ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో..పోలీసులు వెంటనే స్పందించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

గాయపడిన ఓ పోలీస్‌తో పాటు నిందితుడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. వేగంగా కారుతో దూసుకొచ్చిన అగంతకుడు పోలీసులను ఢీకొట్టి తర్వాత అందులో నుంచి దూకి కత్తితో పొడిచాడని, దీంతో ఓ పోలీస్ చనిపోయినట్టు అక్కడ యాక్టింగ్ చీఫ్ యోగానంద పిట్టమన్ తెలిపారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన పోలీస్ విలియమ్ ఇవాన్స్‌ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని భారత్ కి  చెందిన నోహ్ గ్రీన్ (25) అనే నల్లజాతీయుడిగా గుర్తించినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. ఇది ఉగ్రవాద దాడా? కాదా? అనే అంశంపై పోలీసులు ఎటువంటి నిర్ధారణకు రాలేదని పిట్టమన్ పేర్కొన్నారు. 

‘ఈ దాడి వెనుక ఉగ్రవాద హస్తం ఉందని భావించడంలేదు, కానీ, దీనిపై స్పష్టమైన దర్యాప్తు కొనసాగిస్తాం’ అని వాషింగ్టన్ మెట్రోపాలిటిన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కొంటే తెలిపారు.నిందితుడి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

click me!