అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై టారీఫ్స్ వడ్డింపు విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. టారిఫ్‌ల గురించి ప్రపంచంలో గందరగోళం చెలరేగిన వేళ ఇది మంచివార్త.
Donald Trump : టారిఫ్‌ల గురించి ప్రపంచంలో గందరగోళం చెలరేగిన వేళ శుభ వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై పెంచిన టారిఫ్స్ ను 90 రోజుల పాటు అమలు చేయబోనని ప్రకటించారు. అయితే చైనాపై మాత్రం ఆయన ఒత్తిడి ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రకటన ప్రపంచ దేశాలకు కాస్త ఊరటనిస్తోంది.
అయితే నిన్న (బుధవారం) చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10 నుంచి అమెరికా వస్తువులపై 84% దిగుమతి సుంకం (టారిఫ్) విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా విధానాలు అహంకారపూరితంగా, బెదిరింపు ధోరణిలో ఉన్నాయని విమర్శించిన చైనా.. చివరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఇలా చైనా ఎదురుదాడికి దిగడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఇతర దేశాలపై విధించిన టారీఫ్స్ విషయంలో పునరాలోచనలో పడ్డారు. అందుకే మరికొన్ని రోజులు టారీఫ్స్ పెంపు నిర్ణయాన్ని అమలు చేయబోమని ప్రకటించారు.
పన్ను యుద్ధం టైమ్‌లైన్ :
ఏప్రిల్ 1: ట్రంప్ 34% అదనపు పన్నును లిబరేషన్ డే టారిఫ్ పేరుతో ప్రకటించారు.
ఏప్రిల్ 5: దీనికి ప్రతిస్పందనగా చైనా 34% పన్ను, అరుదైన ఖనిజాల ఎగుమతిపై నిషేధం విధించింది.
ఏప్రిల్ 7: ట్రంప్ మరో 50% పన్నును జోడించి చైనాపై మొత్తం 104% పన్ను విధించారు.
ఏప్రిల్ 9: చైనా ఇప్పుడు దీనిని 84%కి పెంచింది, ఇది ఏప్రిల్ 10 నుండి అమలులోకి వస్తుంది.
ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్
చైనా ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదని ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్‌లో రాశారు. మేం వారి కాల్ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే, చైనా నుంచి ఎలాంటి చర్చల ప్రతిపాదన రాలేదన్నారు ట్రంప్.