అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల నిరసన: ఇరువర్గాల పరస్పరం దాడి, హింసాత్మకం

By narsimha lodeFirst Published Nov 15, 2020, 1:05 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది.


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు.ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంంగా వేలాది మంది వాషింగ్టన్ లో ట్రంప్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు.
ఫ్రౌండ్ బాయ్స్, యాంటిఫా వంటి కన్సర్వేటివ్ గ్రూప్ సభ్యులున్నారు. వీరికి ప్రత్యర్ధి వర్గమైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ బృందం ఎదురుపడింది.

దీంతో ఇరువర్గాలు నినాదాలు చేసుకొన్నాయి. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు బాహాబాహికి దిగారు.  శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపింది.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ట్రంప్ ఓటమిలో పెన్సిల్వేనియా కీలకం

ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.నిరసనకారులను చెదరగొట్టేందుకుగాను పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు.  ఈ ఘటనలో 20 మందిని అదుపులోకి తీసుకొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నకు 232 ఓట్లు, బైడెన్ కు 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు దక్కినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.
 

click me!