హిందువులకు దీపావళీ శుభాకాంక్షలు: ఇమ్రాన్ ఖాన్

By Siva KodatiFirst Published Nov 14, 2020, 8:27 PM IST
Highlights

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని.. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని.. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, దీపావళి పండగను పాకిస్తాన్‌ హిందూవులు ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లో మాదిరే దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుంటారు. ఆలయాలు, గృహాలను అందంగా అలంకరించుకుని సంబరాలు జరుపుకుంటారు.

ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు, మాటియారి, టాండో అల్లాహార్, టాండో ముహమ్మద్ ఖాన్, జంషోరో, బాడిన్, సంఘర్, హాలా, టాండో ఆడమ్, షాదాద్‌పూర్‌లలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

పాకిస్తాన్‌ మైనారిటీ వర్గాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అధికార ఘణాంకాలు చెబుతున్నాయి.

 


 

Wishing all our Hindu citizens a happy Diwali.

— Imran Khan (@ImranKhanPTI)
click me!