Trump: పుతిన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు..అనవసరంగా ప్రాణాలు బలి తీసుకుంటున్నారు!

Published : May 26, 2025, 08:42 AM IST
Vladimir Putin Donald Trump

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి చేయగా, పుతిన్ తీరుపై ట్రంప్ మండిపడ్డారు. ఇది రష్యా పతనానికి దారితీస్తుందన్నారు.

ఉక్రెయిన్‌పై జరిగిన ఘోర వైమానిక దాడి నేపథ్యంలో రష్యా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో అధిక సంఖ్యలో  డ్రోన్లు, క్షిపణులతో జరిగిన దాడి ఇదే తొలిసారి. ఆదివారం జరిగిన ఈ దాడిలో రష్యా బలగాలు 367 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డాయి. కీవ్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా, ఈ దాడిలో కనీసం 12 మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. Truth Social అనే తన ప్లాట్‌ఫారంలో పుతిన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పుతిన్‌తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఇప్పుడాయన వ్యవహారం అర్థంకాని స్థాయికి చేరిందన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించాలన్న ఉద్దేశంతోనే పుతిన్ దాడులు తీవ్రతరం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఆయన పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఆయన అధిక సంఖ్యలో ప్రాణాలను  తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇది  రష్యాకే నష్టాన్ని తీసుకురావచ్చని, దీని తాలూకు పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించారు.

అంతటితో ఆగకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయన తీరు ఉక్రెయిన్‌కు మేలు చేయదని, తీసుకునే నిర్ణయాలు దేశాన్ని ఇంకా సంక్షోభంలోకి దారితీస్తున్నాయని అన్నారు. తాను అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే ఈ యుద్ధం మొదలే కాకపోతుందని స్పష్టం చేశారు. అప్పటికే పరిష్కార మార్గం కనుగొని ఉండేవాడినని వ్యాఖ్యానించారు.

ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ దాడిపై స్పందిస్తూ, అమెరికా మౌనం పుతిన్‌కు అనుకూలంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. రష్యా ఇలా దాడులకు తెగబడటం వెనుక ప్రపంచ దేశాల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని ఆయన స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్–రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్న వేళ రష్యా నుంచి వచ్చిన ఈ దాడి, పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే