Trump: హార్వర్డ్‌ అమెరికాకు చాలా ప్రమాదకరం..అక్కడి విద్యార్థులే అసలు సమస్యకు మూలం!

Published : May 29, 2025, 09:59 AM IST
Harvard University why popular among foreigner students

సారాంశం

ట్రంప్ హార్వర్డ్‌ను దేశానికి ముప్పుగా పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులపై ఆంక్షలకు హార్వర్డ్‌ కోర్టుకు వెళ్లగా, ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది.

అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల సమాచారం తమకు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో, తాజాగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో విద్యా వ్యవస్థపై చర్చకు దారితీశాయి.ట్రంప్‌ అభిప్రాయం ప్రకారం, హార్వర్డ్‌ యూనివర్సిటీ అమెరికాకు చేటు కలిగిస్తున్నదిగా ఆయన అభివర్ణించారు. విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరు దేశానికి హాని కలిగించే లక్షణాలు కలిగినవారని, వీరు సృష్టించే సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ట్రంప్‌ వాదనలో, హార్వర్డ్‌ ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యామ్నాయ లాభాలు లేకుండానే 5 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు అందుకుంటోందని ఆరోపించారు. విద్యార్థులుగా చేరుతున్న వారిలో 31శాతం మంది విదేశీయులని, వీరిలో చాలామంది తీవ్రమైన భావజాలం ఉన్న దేశాల నుంచి వస్తున్నారని చెప్పారు. ఇది అమెరికా భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇతర కళాశాలలూ ఇదే దారిలో నడుస్తున్నాయని, వీటిని ఎవరైనా విమర్శిస్తే ఎదురుదాడులు చేస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. అంతేకాకుండా, హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల వాటాను 15శాతానికి తగ్గించాలన్న ఆలోచనను పంచుకున్నారు.ఇదిలా ఉండగా, ట్రంప్‌ ప్రభుత్వం గతంలో హార్వర్డ్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధించింది. అంతేకాదు, విదేశీ విద్యార్థులకు ఇచ్చే ప్రవేశ అనుమతులపై కూడా ఆంక్షలు విధించింది. దీనిపై హార్వర్డ్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ చర్యలు అమెరికా నిబంధనలకు విరుద్ధమని, విద్యారంగానికి భంగం కలిగిస్తాయని హార్వర్డ్‌ వాదించింది.

ఈ వివాదంపై విచారణ చేసిన ఫెడరల్‌ కోర్టు, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విదేశీ విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే