అమెరికా అధ్యక్షుడి సుంకాల నిర్ణయంపై కోర్టు బ్రేక్‌: చట్ట విరుద్ధమన్న ఫెడరల్ తీర్పు

Published : May 29, 2025, 07:50 AM IST
అమెరికా అధ్యక్షుడి సుంకాల నిర్ణయంపై కోర్టు బ్రేక్‌: చట్ట విరుద్ధమన్న ఫెడరల్ తీర్పు

సారాంశం

అమెరికా ఫెడరల్ కోర్టు, ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. అధ్యక్షునికి ఏకపక్ష అధికారాలు లేవని తీర్పు వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక వాణిజ్య చర్యలు చట్టబద్ధతను కోల్పోయినట్టు అమెరికా ఫెడరల్ కోర్టు తేల్చింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఒకమాటగా తీర్పు వెలువరించింది.

ఈ తీర్పులో, ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి స్వతంత్ర అధికారం లేదని పేర్కొంది. అంతేకాక, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకునే సుంకాల నిర్ణయాలు తప్పకుండా కాంగ్రెస్ ఆధీనంలో ఉండాల్సినవే అని కోర్టు స్పష్టం చేసింది.ట్రంప్ పరిపాలన సమయంలో, విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపేలా ఈ చర్యలు సాగాయి. అయితే, ఇవి అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవన్న అభిప్రాయంతో వివిధ వాణిజ్య సంస్థలు, వాణిజ్య వేత్తలు కోర్టును ఆశ్రయించారు.

వారి వాదనల ఆధారంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు, అధ్యక్షునికి నిరంకుశ అధికారాలు లేవని, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో శాసనసభ పాత్ర ముఖ్యమని తేల్చి చెప్పారు.ఈ తీర్పుతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అయినప్పటికీ, ఈ తీర్పును నిలుపుదల చేయాలని ట్రంప్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అభ్యంతరాల నేపథ్యంలో, అమెరికా వాణిజ్య విధానాలపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్ కోర్టు తీర్పు, భవిష్యత్తులో అధ్యక్షుడి అధికారాలకు గరిష్టంగా స్పష్టత తీసుకురావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే