Russia Ukraine Crisis: తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే.. ఇలా జ‌రిగేది కాదు: డొనాల్డ్ ట్రంప్

Published : Feb 27, 2022, 11:31 AM IST
Russia Ukraine Crisis: తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే.. ఇలా జ‌రిగేది కాదు: డొనాల్డ్ ట్రంప్

సారాంశం

Russia Ukraine Crisis: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం అత్యంత పాశవికమని ఆరోపించారు. ఈ దారుణాన్ని జరగనిచ్చిన జో బైడెన్ ప‌రిపాల‌న పై విరుచుక‌ప‌డ్డారు.    

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర స్జాయిలో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా అధ్యక్షుడు  పుతిన్ చేస్తున్న దండ‌యాత్ర‌ను తీవ్రంగా ఖండించారు. 

ఫ్లోరిడాలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ పాల్గొన్న ఆయ‌న ర‌ష్యా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌పై విరుచుకుపడ్డారు. రష్యా భూమిని ఆక్రమించిన ఉక్రేనియన్ల కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని ప‌రోక్షంగా చెప్పుతూ.. 21వ శతాబ్దపు శ‌క్తివంత‌మైన ఏకైక అధ్యక్షుడి నిలుస్తాన‌ని అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడు స్థానంలో ఉండి ఉంటే..  రష్యా దాడి చేసి ఉండేది కాద‌ని అన్నారు. 

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై చేస్తున్న దాడిని అత్యంత పాశవిక చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ఎప్పుడూ జరగకూడనటువంటి దుశ్చర్య, దౌర్జన్యం, బలాత్కారమ‌ని అన్నారు.  ఇలా ఎన్నడూ జరగకూడదనీ, గర్వించదగిన ఉక్రెయిన్ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నామ‌ని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 

జో బైడెన్ అత్యంత శ‌క్తి వంత‌మైన దేశం( అమెరికా) అధ్య‌క్షుడి స్థానంలో ఉండి ఇలాంటి దారుణాలు జ‌రుగుతుంటే ఎలా చూస్తు ఉరుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ప్రపంచం సురక్షితంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుష్ హయాంలో రష్యా జార్జియాపై దాడి చేసిందని, ఒబామా హయాంలో రష్యా క్రిమియాను ఆక్రమించిందని, బిడెన్ హయాంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ట్రంప్ విమ‌ర్మించారు. 
 
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ధైర్యసాహసాలను ట్రంప్ ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని, తాను అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే, యుద్ధం జరిగి ఉండేది కాదని అన్నారు. బైడెన్ వంటి డోలును పుతిన్ వాయిస్తున్నారన్నారు. చూడటానికి ఇది బాగుండదన్నారని ఏద్దేవా చేశారు. 

అందరూ భావించినట్టుగానే..  అమెరికా ఎన్నికలలో అవకతవకలు జరగకపోతే.. తాను మ‌రో సారి అధ్యక్షుడిగా ఉండే వాడిన‌నీ .. ఇలాంటి భయంకరమైన విపత్తు ఎన్నటికీ సంభవించేది కాదని మ‌రోసారి వివ‌రించారు. బలహీనమైన అమెరికా అధ్యక్షుడితోనే ఇలాంటి విప‌త్తులు వ‌స్తున్నాయని జోబైడెన్ ను విమ‌ర్శించారు.

ఇదిలావుండగా, తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లను రష్యా గుర్తిస్తోందని వ్లదిమిర్ పుతిన్ గత సోమవారం రాత్రి టెలివైజ్డ్ స్పీచ్‌లో చెప్పారు. పుతిన్ చర్యను డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిస్తూ, ఇది ‘జీనియస్’ నిర్ణయమని పేర్కొన్నారు. పుతిన్ శాంతికాముకుడని వ్యాఖ్యానించారు. 

పుతిన్‌ను మేధావి అని ట్రంప్ పేర్కొనడంపై జో బిడెన్ స్పందిస్తూ.. "పుతిన్ తనను తాను స్థిరమైన మేధావి అని పిలిచిన దానికంటే నేను ఒక మేధావి అని ట్రంప్ చెప్పుకున్నారు" అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే