ట్రంప్‌ వాషింగ్టన్‌‌ వీడేది అప్పుడే.. !

By AN TeluguFirst Published Jan 16, 2021, 1:29 PM IST
Highlights

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయనున్న రోజే ఉదయం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌‌‌ను వీడనున్నారని సమాచారం. 

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయనున్న రోజే ఉదయం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌‌‌ను వీడనున్నారని సమాచారం. 

బుధవారం ఉదయం ట్రంప్‌ వాషింగ్టన్‌ నుంచి వెళ్లిపోనున్నారని తెలుస్తోంది. కాగా, బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ కూడా స్వాగతించారు. 

ఆయన ప్రమాణస్వీకారానికి రాకపోవడమే మంచిదన్నారు. కానీ, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వస్తే మాత్రం ఆయన రాకను గౌరవంగా భావిస్తానని బైడెన్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ట్రంప్ తన వీడ్కోలు, ఆ తరువాతి కార్యక్రమాలను కూడా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. 
వాషింగ్టన్‌ వెలుపల ఉన్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ హెడ్ క్వార్టర్ జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమం జరగనుందనేది వైట్‌హౌస్ అధికారిక వర్గాల సమాచారం. అలాగే అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లోగల తన మార్‌ ఏ లాగో క్లబ్‌లో ట్రంప్‌ ఉండనున్నారని తెలుస్తోంది. 

కాగా, ప్రమాణస్వీకారోత్సవానికి ముందే బైడెన్‌కు ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్‌హౌస్ సలహాదారులు ట్రంప్‌ను సూచించారట. అయితే, ట్రంప్ అలా చేయటానికి సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలోనే రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్ అప్రదిష్ట మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 

click me!