కెనడాలో బస్సును ఢీ కొన్న ట్రక్కు.. 15 మంది మృతి..

Published : Jun 16, 2023, 09:36 AM IST
కెనడాలో బస్సును ఢీ కొన్న ట్రక్కు.. 15 మంది మృతి..

సారాంశం

మానిటోబాలోని కార్బెర్రీ పట్టణానికి సమీపంలో రోడ్డు జంక్షన్ వద్ద సెమీ ట్రైలర్ ట్రక్కు చిన్న బస్సును ఢీకొనడంతో 15 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు కార్బెర్రీలోని క్యాసినోకు వెళుతోంది.

మానిటోబా : కెనడాలోని మానిటోబాలో గురువారం నాడు సెమీ ట్రైలర్ ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో కనీసం 15 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ బస్సులో అందరూ వృద్ధులే ఉన్నారని తెలుస్తోంది. 

ఇటీవలి కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలలో ఈ ప్రమాదం ఒకటి. మానిటోబాలోని కార్బెర్రీ పట్టణానికి సమీపంలో రెండు ప్రధాన రహదారుల జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణికులు కార్బెర్రీలోని ఒక క్యాసినోకు వెళ్తున్నారని క్యాసినో ప్రతినిధి చెప్పినట్టు స్థానిక వార్తాకథనాలు వెలువడ్డాయి. 

"ఈ ప్రమాదం కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు నిర్ధారించగలిగాం" అని మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు కమాండ్ అసిస్టెంట్ కమీషనర్ రాబ్ హిల్ చెప్పారు. హిల్ ఒక టెలివిజన్ లో మాట్లాడుతూ, "ఇది మానిటోబాలో. కెనడాలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం నమ్మశక్యం కాని విధంగా ఉంది. చాలా విచార కరమైన, మరిచిపోలేని రోజు.." అన్నాడు. 

బిపర్ జాయ్ తుపాను : గుజరాత్‌లో తీరం దాటి, విధ్వంసం.. రాజస్థాన్‌ దిశగా ప్రయాణం..

బస్సులో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వాహనాల డ్రైవర్లు సజీవంగా ఉన్నారని తెలిపారు. అయితే, ప్రమాదానికి ఎవరు కారణం అనే విషయాన్ని చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.

మొదట వాహనం బస్సుగా కాకుండా వ్యాన్‌గా గుర్తించాయి. వృద్ధులు,  వికలాంగులను రవాణా చేసే హ్యాండి-ట్రాన్సిట్ ద్వారా దీనిని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కాలిపోయిన తెల్లటి మినీవాన్-పరిమాణ వాహనం, స్టిల్ ఫోటోను చూపింది. ఇది ముందు ధ్వంసమైన నీలిరంగు ట్రక్కు చిత్రాన్ని కూడా చూపించింది.

ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక ట్వీట్‌లో, "ఈరోజు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తులు అనుభవిస్తున్న బాధను నేను ఊహించలేకపోతున్నాను" అని ఆయన అన్నారు. "కార్బెర్రీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం వార్త విని నా గుండె పగిలింది" అని మానిటోబా ప్రీమియర్ హీథర్ స్టెఫాన్సన్ ట్విట్టర్‌లో తెలిపారు.

కాగా, ఈ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సస్కట్చేవాన్‌లో, గ్రామీణ రహదారిపై జూనియర్ హాకీ జట్టును రవాణా చేస్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఏప్రిల్ 2018లో 16 మంది మరణించారు. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్‌కు 2019లో ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. 

కెనడా చరిత్రలో అత్యంత ఘోరమైన ట్రాఫిక్ ప్రమాదం 1997లో క్యూబెక్ ప్రావిన్స్‌లో సీనియర్లతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడి 44 మంది మరణించారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !