'పార్లమెంట్ లో లైంగిక వేధింపులకు గురయ్యా.. ': మహిళ ఎంపీ సంచలన ఆరోపణలు

Published : Jun 16, 2023, 04:46 AM IST
'పార్లమెంట్ లో లైంగిక వేధింపులకు గురయ్యా.. ': మహిళ ఎంపీ సంచలన ఆరోపణలు

సారాంశం

ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిదియా థోర్పె (Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందనీ, పవిత్రమైన పార్లమెంటు భవనంలోనే తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు.  

ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిదియా థోర్పె (Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పార్లమెంటు భవనం మహిళలకు సురక్షితమైన స్థలం కాదని ఆమె విలపించారు. సెనేట్ ప్రసంగంలో మహిళా ఎంపీ తన పక్షాన నిలిచారు. గది నుండి బయటకు వెళ్లేటప్పుడు కూడా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళా ఎంపీ అన్నారు.  

పార్లమెంటు లోపల కొంతమంది శక్తివంతమైన వ్యక్తులు తనను అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని వాపోయింది. లిబరల్ పార్టీకి చెందిన సహ సెనెటర్ డేవిడ్ వాన్ (David Van) తనను చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని, పార్లమెంట్ మెట్ల దగ్గర తనను పట్టుకుని అనుచితంగా తాకారని ఆవేదన వ్యక్తం చేశారు. థోర్ప్ బుధవారం తన తోటి సెనేటర్‌ను కూడా తాను చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఈ తరహా లైంగిక వేధింపులకు చాలా మంది మహిళలు బలైపోయారని ఎంపీ థోర్ప్ పేర్కొన్నారు. 

 ఎంపీ  లిదియా థోర్పె చేసిన ఈ ఆరోపణలను సెనెటర్ డేవిడ్ వాన్ తీవ్రంగా ఖండించారు. థోర్ప్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో తాను చాలా బాధపడ్డానని వాన్ చెప్పాడు. దురుద్దేశంతో.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఆమె ఈ ఆరోపణలు చేశారని అన్నారు.  థార్ప్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వాన్ మీడియా ప్రతినిధులతో అన్నారు. అదే సమయంలో, థోర్ప్ చేసిన ఆరోపణలతో డేవిడ్ వాన్ ను  లిబరల్ పార్టీ గురువారం అతన్ని సస్పెండ్ చేసింది. ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో డేవిడ్ వాన్ లాయర్ల సాయం కూడా తీసుకున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !