మనుషుల్లారా.. సిగ్గుతో చచ్చిపోండి (వీడియో)

First Published Jun 9, 2018, 3:10 PM IST
Highlights

మనుషుల్లారా.. సిగ్గుతో చచ్చిపోండి (వీడియో)

మనిషి తన స్వార్థం కోసం పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తున్నాడో  రోజూ మనం  చూస్తూనే వున్నాం.. పర్యావరన పరీరక్షణ కోసం నిత్యం ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి వంటి సంస్ధలు ఎంతగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నా మనిషిలో కాస్త కూడా చలనం లేదు. కానీ ఒక మూగజీవి మాత్రం పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేక.. మనిషిపై దాడి చేసింది. 2013లో చిత్రీకరించినట్లుగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలోని ఓ అటవీ ప్రాంతంలో ఓ చెట్టును కూల్చేందుకు అక్కడివారు ప్రయత్నిస్తున్నారు. బుల్డోజర్‌ను ఉపయోగించి చాలా వరకు చెట్టును పెకలించివేశారు కూడా.. అయితే ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ పెద్ద కోతి బుల్డోజర్‌కు అడ్డుపడింది.. ఎంతకు అక్కడి నుంచి కదల్లేదు.. చివరకు బలంగా బుల్డోజర్ బ్లేడ్‌ను చెట్టుపై మోదడంతో అది కిందపడిపోయింది. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న ఇంటర్నేషనల్ యానిమల్ రెస్క్యూ అనే జంతు సంస్థ వెంటనే ఆ కోతిని కాపాడింది. హృదయాన్ని కదలించి వేస్తున్న ఈ వీడియో చూసైనా.. ప్రకృతి పట్ల ఆ మూగజీవి చూపిన ప్రేమను  కాస్తైనా చూపించి పర్యావరణాన్ని కాపాడుకుందాం.

click me!