మత ఛాందసవాదులకు లొంగిపోతున్నారు.. కెనడా ప్రధాని ట్రూడోపై భారత్ ఆగ్రహం

By Galam Venkata RaoFirst Published Oct 14, 2024, 3:20 PM IST
Highlights

నిజ్జర్ హత్య కేసులో హై కమిషనర్‌పై కేసు నమోదు చేయడానికి భారతదేశం అనుమతి కోరింది కెనడా. దీనిపై భారత్ దీటుగా బదులిచ్చింది.

ఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని, మతవాదులకు లొంగిపోతున్నారని ఆరోపించింది. భారత హై కమిషనర్‌ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మత ఛాందసవాదులకు లొంగిపోయి ట్రూడో భారత్‌పై కుట్రలు పన్నుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది..

కాగా, నిజ్జర్ హత్య కేసులో హై కమిషనర్‌పై కేసు నమోదు చేయడానికి భారతదేశం అనుమతి కోరింది కెనడా. దీనిపై ఇండియా దీటుగా స్పందించింది. భారతదేశం తగిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ బదులిచ్చింది.

Latest Videos

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ కేసులో ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. కరణ్ బ్రార్, కమల్‌ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్‌లను హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఎడ్మంటన్‌లో వీరిని పట్టుకున్నారు.

అరెస్టయిన ముగ్గురూ భారతీయులు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వారు కెనడాలో ఉంటున్నారని కెనడా పోలీసులు తెలిపారు. అయితే, వారికి భారత ప్రభుత్వంతో సంబంధం ఉందా అనే దానిపై ప్రస్తుతం స్పందించలేమని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

click me!