
అరిజోనా : అమెరికాలో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అరిజోనాలో 6 ఏళ్ల బాలిక మృతి చెందింది. అయితే, ప్రమాదానికి కారణమై బోట్ ప్రొపెల్లర్‌ను నడుపుతుంది ఆ చిన్నారి తల్లే కావడం విషాదం. బోట్ ప్రొపెల్లర్ తో ప్రమాదవశాత్తు చిన్నారిని కొట్టడంతో అక్కడికక్కడే మరణించిందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
మారికోపా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన శుక్రవారం ఉదయం అరిజోనాలోని లేక్ ప్లెసెంట్‌లో జరిగింది. బాలిక ఉదయం 11 గంటల ప్రాంతంలో సరస్సు ఒడ్డున ఈత కొడుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాలకు చెందిన 12 మంది అక్కడికి షికారుకు వచ్చారు. ఆ తరువాత సరస్సులో విహరించడానికి పడవలో బయలుదేరారు.
68వ అంతస్తు నుండి పడి ఫ్రాన్స్ కు చెందిన డేర్‌డెవిల్ రెమి లూసిడి మృతి..
ఆ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ... ‘మాకు 911కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒకరి 6 ఏళ్ల కుమార్తెకు పడవ ప్రొపెల్లర్ తగిలిందని తెలిపారు. ఆ సమయంలో బాలిక తల్లి పడవను నడుపుతోంది. ఆమె భర్త వేక్‌బోర్డ్ ను లాగి వాహనం నడపడం ప్రారంభించినప్పుడు చిన్నారి నీటిలో ఉన్నట్లు తెలియదని సంఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు.
నీటిలో ఎవరో ఉన్నారని గమనించిన తండ్రి ఈదుకుంటూ వచ్చాడు. "తమ కుమార్తె నీటిలో ఉందని, పడవ ప్రొపెల్లర్ తాకడంతో కాలు తెగిపోయిందని అతను, తల్లి వెంటనే గ్రహించారు" అని డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, అది చిన్న బీచ్ కావడంతో 911కి కాల్ చేయడానికి వారికి చాలా కష్టం అయ్యిందని తెలిపారు.
సమీపంలోని బోటర్లు గాయపడిన అమ్మాయిని పడవలోకి ఎక్కించి, ఆమెను ఒడ్డుకు చేర్చడం ద్వారా కుటుంబానికి సహాయం చేశారు. "చిన్నారిని ఆమె కుటుంబం మెరీనా సరస్సుకు తీసుకువెళ్లింది. అక్కడ ఎంసిఎస్ఓ సహాయకులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కలుసుకున్నారు. వెంటనే బిడ్డకు సహాయం అందించడం ప్రారంభించారు.
తరువాత ఆ బిడ్డను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు నిర్థారించారు" అని తెలిపింది. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే, ఇది కేవలం ఘోర ప్రమాదం మాత్రమేనని పోలీసు శాఖ భావిస్తోంది.
మొత్తం 12 మంది సభ్యులు లైఫ్ దుస్తులు ధరించి ఉన్నారని, వారంతా సురక్షితం అని తెలిపారు. "ఈ సంఘటనకు దారితీసిన కారణం పడవలో చాలా మంది వ్యక్తులు ఉండడమే" అని పోలీసులు తెలిపారు.