విషాదం.. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి కుటుంబం..

By Asianet News  |  First Published Oct 7, 2023, 7:31 AM IST

భారత సంతతి కుటుంబం అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇందులో ఇద్దరు దంపతులు కాగా.. మరో ఇద్దరు వారి పిల్లలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో అనుమాస్పదంగా మరణించారు. వారంతా ఇంట్లోనే శవాలై కనిపించారు. అయితే దీనిని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భారత సంతతికి చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ (43) తన భార్య సోనాల్ పరిహార్ (42) 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల బాలుడితో కలిసి ప్లెయిన్స్ బోరోలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు.

విషాదం.. గంగా నదిలో సాన్నానికి వెళ్లి.. నీట మునిగి ఐదుగురు బాలుర దుర్మరణం..

Latest Videos

undefined

అయితే ఈ నెల 4వ తేదీ సాయంత్రం పోలీసులకు వారి బంధువు ఒకరు ఫోన్ చేశారు. తేజ్ ప్రతాప్ సింగ్ కుటుంబం ఎలా ఉందో కనుక్కోవాలంటూ అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఆ కుటుంబం నివసించే ఇంటికి వెళ్లి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించారని ప్లెయిన్స్ బోరో పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు ఈసీ కీల‌క స‌మావేశం

తేజ్ ప్రతాప్ సింగ్ నెస్ డిజిటల్ ఇంజనీరింగ్ లో లీడ్ ఎపిక్స్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య కూడా మరో ఐటీ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారని బంధువులు తెలిపారు.  ప్రతాస్ సింగ్ కుటుంబం కమ్యూనిటీలో అందరితో కలిసి మెలిసి ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు. ఆ కుటుంబ మొత్తం ఎంతో సంతోషంగా ఉండేదని చెబుతున్నారు. కానీ ఇంత పెద్ద దుర్ఘటన జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రతాప్ సింగ్ ముందుగా తన కుటుంబాన్ని హతమార్చి, తరువాత సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

click me!