Titanic submarine Missing: టైటానిక్ పడవ ప్రమాద శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న టైటాన్ అనే సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. అయితే, టైటాన్ పైలట్ భార్య వెండీ రష్, 1912లో టైటానిక్‌లో మరణించిన దంపతుల మునిమనవరాలు కావడం గమనించాల్సిన విషయం.
Submersible Titanic: టైటానిక్ పడవ ప్రమాద శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న 'టైటాన్' అనే సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. అయితే, టైటాన్ పైలట్ భార్య వెండీ రష్, 1912లో టైటానిక్‌లో మరణించిన దంపతుల మునిమనవరాలు కావడం గమనించాల్సిన విషయం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ కుటుంబాన్ని టైటానిక్ ప్రమాదం వదలడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. గల్లంతైన టైటానిక్ టూరిస్ట్ సబ్ మెరైన్ పైలట్ భార్య వెండీ రష్ 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ నౌక మునిగి మరణించిన అమెరికా దంపతుల వారసురాలు. జేమ్స్ కామెరూన్ హాలీవుడ్ మూవీ 'టైటానిక్'లోనూ ఈ జంట నటించడం విశేషం. 1912 ఏప్రిల్ లో టైటానిక్ నౌక మంచుకొండను ఢీకొని మునిగిపోయినప్పుడు టైటానిక్ లో ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులుగా ప్రయాణిస్తున్న రిటైలింగ్ దిగ్గజం ఇసిడోర్ స్ట్రాస్, అతని భార్య ఇడా మనుమరాలే ఈ వెండీ రష్. స్ట్రాస్ 1845 లో జన్మించాడు. ఆయన మాసీ డిపార్ట్మెంట్ స్టోర్ కు సహ యజమాని అని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
undefined
1986 లో జూన్ 18న సంబంధాన్ని కోల్పోయిన టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్‌ను నిర్వహిస్తున్న ఓషన్‌గేట్ సీఈవో స్టాక్టన్ రష్ ను వివాహం చేసుకున్నారు. టైటానిక్ కు పర్యాటకులను తీసుకెళ్తున్న జలాంతర్గామి టైటాన్ కు కూడా ఆయన పైలట్ కొనసాగారు. ఇప్పుడు ఆ టైటాన్ అదృశ్యమైంది. గల్లంతైన జలాంతర్గామిలో ఉన్న ఐదుగురిలో స్టాక్టన్ రష్ కూడా ఒకరు, సహాయక బృందాలు కేవలం గంటల ఆక్సిజన్ సపోర్ట్ మాత్రమే మిగిలి ఉండటంతో నౌక ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. టైటానిక్ దంపతుల వారసురాలు వెండీ రష్ ఓషన్ గేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అనీ, టైటానిక్ కు కంపెనీ చేసిన మూడు సాహసయాత్రల్లో పాల్గొన్నారని ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ తెలిపింది.
మంచుకొండను ఢీకొట్టి మునిగిపోతున్న టైటానిక్ నౌకలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉండటంతో ఇసిడోర్ స్ట్రాస్ లైఫ్ బోట్ లో కూర్చోలేదని ఆర్కైవల్ రికార్డులు చెబుతున్నాయి. అతనితో పాటు అతని భార్య కూడా ఓడ మునిగిపోయే వరకు చేతులు పట్టుకుని ఉన్నాడు. లైఫ్ బోట్ లో ఆమెను కాపాడుతుండగా ఇడా స్ట్రాస్ తన మింక్ జాకెట్ ను తన పనిమనిషికి అందజేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. టైటానిక్ మునిగిన కొన్ని వారాల తర్వాత స్ట్రాస్ అవశేషాలు సముద్రంలో కనుగొనబడినప్పటికీ, అతని భార్య మృతదేహం కనుగొనబడలేదు. కాగా, 1997లో జేమ్స్ కామెరూన్ తీసిన హాలీవుడ్ చిత్రం టైటానిక్ లో ఈ జంట కల్పిత వెర్షన్ వచ్చింది. స్ట్రాస్-అతని భార్యను వృద్ధ జంటగా చిత్రీకరించారు. అట్లాంటిక్ చల్లని నీరు వారి క్యాబిన్లోకి ప్రవేశించినప్పుడు వారు మంచంపై కౌగిలించుకోవడం ఒక షాట్ లో చూపించారు.
అదృశ్యమైన టైటాన్..
అట్లాంటిక్ మహాసముద్రంలో 12,500 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాల ప్రదేశానికి ప్రయాణాన్ని ప్రారంభించిన జలాంతర్గామి టైటాన్ ఆదివారం దాదాపు రెండు గంటల తర్వాత సంబంధాలు కోల్పోయింది. ఈ జలాంతర్గామిలో నాలుగు రోజుల ఎమర్జెన్సీ ఆక్సిజన్ సపోర్ట్ ఉంటుంది. ఇదిలావుండగా, టైటాన్ అదృశ్యమైన ప్రాంతానికి సహాయక బృందాలు బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) మరిన్ని నౌకలు, బోట్లను తరలించి సహాయక చర్యలు చేపట్టాయి. వరుసగా రెండవ రోజు తాము గుర్తించిన నీటి అడుగు శబ్దాలు మరింత అత్యవసర మిషన్ లో తమ అన్వేషణను తగ్గించడానికి సహాయపడతాయని ఆశించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. సుమారు 26,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు కిలోమీటర్ల లోతు నీటిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఫస్ట్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ కు చెందిన కెప్టెన్ జేమీ ఫ్రెడరిక్ తెలిపారు.